Tomato Prices : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టమాటా ధరలు డౌన్ అయ్యాయి. దీంతో టమాటా రైతులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. తమకు కనీసం పెట్టుబడి తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆస్పరి, పత్తికొండ మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.4కు పడిపోయింది. దీంతో ఎంతోమంది రైతులు టమాటాలను పారబోసి బాధతో వెనక్కి తిరిగారు. టమాటాను సాగు చేసినందుకు కనీసం రవాణా ఛార్జీలు కూడా తమ చేతికి రాలేదని రైతులు చెప్పుకొచ్చారు.బహిరంగ మార్కెట్లో మాత్రం కేజీ టమాటా ధర రూ.15 నుంచి రూ.20 దాకా పలుకుతోంది. ఓ వైపు రైతు, మరోవైపు కొనుగోలుదారుడిపై ధరా భారం కంటిన్యూ అవుతోంది. కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.
Also Read :KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో..
ఈనేపథ్యంలో టమాటా రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు ముందుకు వచ్చింది. ఈరోజు నుంచి ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా పంటను కొంటున్నారు. ఈవిధంగా కొనే టమాటాలను రైతు బజార్లలో విక్రయిస్తారని తెలుస్తోంది. అవసరం మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని ఏపీ సర్కారు మార్కెటింగ్ శాఖ భావిస్తోందట. మొత్తం మీద ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై టమాటా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read :Solar Soundbox : సోలార్ సౌండ్ బాక్స్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
పీఎం కిసాన్ కీలక అప్‌డేట్
తాజాగా 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ నిధుల జమపై ఒక అప్‌డేట్ వచ్చింది. దీని ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ డబ్బులను రైతులు పెట్టుబడి అవసరాల కోసం వాడుకోవచ్చు. ఇప్పటి వరకు 18 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది.