తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy)పై వైసీపీ హైకోర్టును (YCP Approached High Court) ఆశ్రయిచింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే వచ్చే బుధవారం వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తిరుమల లడ్డు ప్రసాదం అంటే ఒక అమృతం, అద్భుతం. స్వయంగా శ్రీవారే అనుగ్రహించే ప్రసాదమని భక్తుల విశ్వాసం. కానీ నేడు ఈ లడ్డూ ప్రతిష్ఠకు, హిందువుల విశ్వాసాలకు భంగం వాటిల్లేలా ఆరోపణలొస్తున్నాయి. భక్తుల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపుపై ఇప్పుడు నీడ కమ్ముకుంది.
తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు , (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై రెండు రోజులుగా భక్తులు, రాజకీయేతర పార్టీల నేతలు జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి అంటూ ప్రమాణాలకు సిద్ధం అంటున్నారు. ఈరోజు దీనిపై ఏకంగా హైకోర్టు కు వెళ్లారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై కోర్ట్ ఏమిచేస్తుంది అనేది చూడాలి.
లడ్డు వివాదం ఫై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని రమణ దీక్షితులు అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురి చేసిందని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీలో ప్రక్షాళన మొదలైందని వివరించారు.
Read Also : India vs Bangladesh: భారత్ 376 పరుగులకు ఆలౌట్.. రాణించిన అశ్విన్, జడేజా..!