Site icon HashtagU Telugu

AP Govt : జూన్ లో ఏపీ ప్రజలకు డబ్బులే డబ్బులు..ఎలా అనుకుంటున్నారా..?

Ap People Money

Ap People Money

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూన్ నెల అంత డబ్బులు కురిపించబోతుంది. అదేలా అనుకుంటున్నారా..? ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ముందు ప్రకటించిన “సూపర్ సిక్స్” (Super Six) హామీల్లో కీలకమైన మూడు పథకాలను జూన్ నెలలో అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. పథకాలకు అర్హులైన లబ్దిదారుల జాబితాలు సిద్ధం చేయడం, దరఖాస్తులు పరిశీలించడం వంటి పనులు ఫాస్ట్ ట్రాక్ లో సాగుతున్నాయి.

International Nurses Day : వైద్య‌రంగంలో న‌ర్సుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

ముందుగా “అన్నదాత సుఖీభవ” (Annadata Sukhibhava) పథకం ద్వారా అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ నెల 20లోపు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో కలెక్టర్లు రెడీగా పనిచేస్తున్నారు. రెండవది “ఎస్సీ కార్పొరేషన్ రుణాలు” (SC Corporation Loans) పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎస్సీ వర్గానికి చెందిన వారు తమ చేతి వృత్తులు, వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ. 5 లక్షల వరకూ రుణం పొందనున్నారు. అందులో 50% ను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. దీనికీ ఈ నెల 20 చివరి తేదీగా నిర్ణయించారు.

మూడవదిగా “తల్లికి వందనం” (Thalliki Vandanam ) పథకం ద్వారా స్కూల్‌కి వెళ్లే ప్రతి పిల్లవాడి తల్లికి రూ. 15,000 చొప్పున జూన్ నెలలో నిధులు జమ చేయనున్నారు. మహిళల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కీలకమైన ఈ పథకం ఇప్పటికే ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ నెల 20లోపు అర్హుల జాబితా పూర్తవుతుంది. లబ్ధిదారుల ఖాతాల్లో జూన్ మొదటి వారంలోనే డబ్బులు జమవుతాయి. మొత్తం మీద వచ్చే 30 రోజుల్లో ఏపీ ప్రజలకు చేతిలోకి లక్షల రూపాయలు వచ్చేందుకు ముహూర్తం సిద్ధం అవుతుంది.