Site icon HashtagU Telugu

Rajya Sabha : ఒక్క రాజ్యసభ సీటు.. రేసులో ఇద్దరు కీలక నేతలు

Rajya Sabha Candidate Kiran Kumar Reddy Gvl Narasimha Rao Vijayasai Reddy

Rajya Sabha : వైఎస్సార్ సీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై ఏపీలోని కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది. ఈ సీటును ఏ పార్టీకి ఇవ్వాలనేది ఫిక్స్ అయ్యిందట. అయితే ఏ నేతకు ఈ రాజ్యసభ సీటును కట్టబెట్టాలి ? అనే దానిపై సదరు రాజకీయ పార్టీ మేధోమధనం చేస్తోందట.

Also Read :Miss World 2025: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఏ రోజు ఏం జరుగుతుంది ?

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు.. 

ఆ రాజ్యసభ స్థానం బీజేపీకే దక్కొచ్చని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగి, దాని కోసం తమవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేసే దిశగా బీజేపీ కసరత్తు చేస్తోందట. విజయ సాయిరెడ్డి స్థానాన్ని  రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికే కేటాయించే అంశం బీజేపీ పరిశీలనలో ఉందట.   ఈ రాజ్యసభ సీటును పొందేందుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. పలువురు బీజేపీ జాతీయ స్థాయి నేతలను ఆయన సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఒకే జిల్లా వ్యక్తి కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Gautham Ghattamaneni: యాక్టింగ్‌‌తో మెప్పించిన మహేశ్‌‌బాబు కుమారుడు గౌతమ్

జీవీఎల్ నర్సింహారావు సైతం..

బీజేపీ హైకమాండ్‌లోని ముఖ్య నేతలతో సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలను  కలిగిన జీవీఎల్ నర్సింహారావు(Rajya Sabha) సైతం ఈ పోటీలోకి వచ్చారు.  గతంలో ఆయనను బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ స్థానం నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా విశాఖ లోక్‌సభ స్థానం టీడీపీకి దక్కింది. తదుపరిగా అనకాపల్లి సీటు కోసం జీవీఎల్ ట్రై చేశారు. అయితే ఆ సీటును సీఎం రమేశ్‌కు బీజేపీ కట్టబెట్టింది. ఈనేపథ్యంలో ఈసారైనా తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని బీజేపీ పెద్దలను జీవీఎల్ కోరుతున్నారట. అయితే ఉమ్మడి ఏపీ రాజకీయాలపై మంచి అవగాహన కలిగిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అవకాశం ఇస్తుందా ? సుదీర్ఘ కాలంగా పార్టీకి విధేయుడిగా ఉంటున్న జీవీఎల్‌కు రాజ్యసభ సీటు ఇస్తుందా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.   మొత్తం మీద కొత్తగా రాజ్యసభకు ఎంపికయ్యే అభ్యర్ధి 2028 జూన్ వరకు ఎంపీగా కొనసాగనున్నారు.