Site icon HashtagU Telugu

Araku Coffee Stall : ఇది మన గిరిజన రైతులకు గర్వకారణం: సీఎం చంద్రబాబు

This is a matter of pride for our tribal farmers: CM Chandrababu

This is a matter of pride for our tribal farmers: CM Chandrababu

Araku Coffee Stall : ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుపై స్పందించారు. పార్లమెంటులో కాఫీ ప్రియులకు శుభవార్త మీరు ఇకపై పార్లమెంటు ఆవరణలోనే తయారుచేసిన అరకు కాఫీని ఆస్వాదించవచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి కప్పును ఆస్వాదిస్తుంటే వారి స్ఫూర్తిదాయక ప్రయాణం గుర్తుకురావాలి అని అన్నారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.

Read Also: Betting Apps : 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసు నమోదు

అంతేకాక..అరకు కాఫీ గురించి మన్ కీ బాత్‌లో ప్రస్తావించినందుకు ప్రధాని మోడీకి, పార్లమెంట్‌లో కాఫీ స్టాల్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పార్లమెంట్‌లో మన అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించేందుకు ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు చెప్పారు.

ఇక, ఈరోజు పార్లమెంట్‌లో రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అలాగే రాజ్యసభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు లోయలో కాఫీ సువాసన పార్లమెంట్ లో గుబాళించబోతోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

Read Also: Aalim Hakim : సూపర్ స్టార్లు, మెగా క్రికెటర్లకు ఈయనే హెయిర్ స్టయిలిస్ట్