Anna Canteens: ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా కూటమి పార్టీ (టీడీపీ-జనసేన-బీజేపీ)లు ఘన విజయం సాధించిన అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్లు లబ్దిదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు సర్కార్ అన్న క్యాంటీన్ల (Anna Canteens)ను అమలు చేయనున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు అధికారులు.
అయితే ఈ అన్న క్యాంటీన్లకు చాలామంది తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు.
ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న అన్నక్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించడం అభినందనీయం. ఆ సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు నేడు సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తం లో విరాళం… pic.twitter.com/fxxdmXJhfe
— N Chandrababu Naidu (@ncbn) August 13, 2024
సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు నేడు సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తంలో విరాళం అందిస్తానని తెలపడం హర్షణీయం. ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పేద వాడికి అన్నం పెట్టే మంచి కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలిసి అన్ని వర్గాల వారూ అందులో భాగస్వాములు అవుతుండడం ఆనందంగా ఉంది. తమకు ఉన్నదాంట్లో కొంత సమాజం కోసం ఖర్చు చేయాలనే వారి ఆలోచనలు అందరికీ స్ఫూర్తి దాయకమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.