Tirumala – December : డిసెంబరులో తిరుమలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలివే..

Tirumala - December : ఏడాదిలో చివరి నెల కావడంతో  ఏటా డిసెంబరులో తిరుమల శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తజనం దర్శించుకుంటుంటారు.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 09:46 AM IST

Tirumala – December : ఏడాదిలో చివరి నెల కావడంతో  ఏటా డిసెంబరులో తిరుమల శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తజనం దర్శించుకుంటుంటారు. యావత్ దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగుతాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

  • డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌ భోజ‌న ఉత్స‌వం జరుగుతుంది.
  • డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి నిర్వహిస్తారు.
  • డిసెంబ‌రు 12న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభమవుతాయి.
  • డిసెంబ‌రు 17న ధ‌నుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. 
  • డిసెంబ‌రు 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర‌ ఉత్సవాలు ఉంటాయి. 
  • డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి ప్రారంభమవుతుంది. అనంతరం శ్రీవారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభమవుతుంది. ఆ రోజున ఆ ఏడు కొండలవాడిని తనివితీరా చూడాలని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
  • సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా దర్శనం, ఆర్జిత సేవా దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటి మార్గాల్లో తిరుమల శ్రీవారిని(Tirumala – December) దర్శించుకోవచ్చు.

Also Read: First Image : చైనా స్పేస్ స్టేషన్ తొలి ఫొటో ఇదిగో..