ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ (AP Cabinet) సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో రెండో విడత భూసేకరణకు ఆమోదం తెలుపుతూ 44,000 ఎకరాల భూమిని సేకరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే “స్వర్ణాంధ్ర పథకంలో భాగంగా” కమిటీలను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సహకారంతో పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌ను దశల వారీగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.
Mahesh Babu : ‘సితారే జమీన్ పర్’పై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
అంతే కాదు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జూలై 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, దాతల సహకారం తీసుకోవచ్చని తెలిపారు. జిల్లాల వారీగా అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే మార్కెట్‌లోకి ప్రవేశించి కొనుగోళ్లు జరుపుతుందని సీఎం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధిని పురోగతిలో ఉంచే లక్ష్యంతో అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ కంపెనీకి సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిన టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధికి గాను వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాలని, పంటలకు డిమాండ్ ఉన్న దిశగా రైతులకు మార్గనిర్దేశం చేయాలని వ్యవసాయశాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.