Site icon HashtagU Telugu

YCP Criminal Ideology: వైసీపీ నేరపూరిత, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్న ఘటనలు ఇవే!

TDP vs YCP

TDP vs YCP

YCP Criminal Ideology: తెలుగుదేశం తమ పార్టీ సిద్దాంతాలకు నూతనత్వం ఇచ్చి ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు కడప మహానాడులో ఆవిష్కృతం అయ్యాయి. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు వివరించింది తెలుగుదేశం. ఇదే సమయంలో రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన వేరువేరు ఘటనలు వైసీపీ రాక్షస సిద్దాంతాన్ని, వారి DNAలో ఉన్న నేరపూరిత, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం (YCP Criminal Ideology) చేస్తున్నాయి.

తెనాలి ఘటన

తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్ కు గురైన రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్ కు కులం రంగు పులిమి దాని నుంచి సమాజానికి తప్పుడు సమాచారం పంపే ప్రయత్నాన్ని సాక్షి ద్వారా, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా వైసీపీ గట్టి ప్రయత్నమే చేసింది. అయితే ఈ ఘటనలో ఒక్కొక్కరిపై ఉన్న 9 కేసులు, వారి నేరచరిత్ర, వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ నీచ రాజకీయం తేటతెల్లం అయ్యింది. అయినా సిగ్గులేని రాజకీయం కోసం జగన్ వాళ్లను పరామర్శిస్తున్నాను అని బయలుదేరుతున్నాడు. వాస్తవంగా చూస్తే ఆ గంజాయి బ్యాచ్ పై పోలీసుల చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల క్యూ లైన్ లో నినాదాలు

అధికారంలో ఉన్నప్పుడు పరమ పుణ్యక్షేత్రమైన తిరుమలలో అనేక అపచారాలకు పాల్పడింది వైసీపీ. అయితే అధికారం పోయిన తరవాత కూడా తన తీరు మార్చుకోలేదు. తిరుమలపై రోజూ విషం చిమ్ముతూ పేటిఎం బ్యాచ్ ద్వారా కుట్రలు అమలు చేస్తోంది. నిన్న తిరుమల క్యూ లైన్ లో టీటీడీకీ వ్యతిరేకంగా నినాదాలు చేసిన వాడు.. కాకినాడ వైసీపీ నాయకుడు బి అచ్చారావు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలుస్తోంది. దర్యాప్తు చేస్తే ఆ వ్యక్తి కాకినాడ వైసీపీ నేత అని రుజువు అయ్యింది. అతను అరవడం.. వీడియో తీయడం, దాన్ని వైరల్ చేయడం అనేది పూర్తిగా కుట్రగా, ప్రణాళిక ప్రకారం సాగింది.

పిల్లాడి సైకిల్ పై పైశాచికత్వం

వైసీపీ కార్యకర్తల ఆలోచన గాని, వారి నాయకత్వం పోకడలు గాని ఏమాత్రం మారలేదు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేడుక సందర్భంగా ఇబ్రహీం పట్నంలో వారి సైకోతనం మరోసారి సమాజం చూసింది. అటుగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న పిల్లాడి నుంచి ఆ సైకిల్ లాక్కుని దానిపై వైసీపీ కార్యకర్తలు వారి వికృత రూపాన్ని ప్రదర్శించారు. సైకిల్ ను గాల్లో తిప్పి, నేల కేసి కొట్టి, కాళ్లతో తన్ని పైశాచిక ఆనందం పొందారు. తన సైకిల్ పాడుచేయవద్దని చిన్నపిల్లాడు ఏడుస్తూ వేడుకున్నా ఆ మూక ఆగలేదు. ఇది చిన్న ఘటన కాదు. అత్యుత్సాహంతో చేసిన పని కూడా కాదు. ఇది ఆ పార్టీ నేతల, కార్యకర్తల మనస్థత్వాన్ని చాటిచెపుతోంది. వారి ఆలోచనా విధానాలను ఆవిష్కరిస్తోంది. ప్రజలు ఆలోచించాలి.

టార్గెట్ లోకేష్.. వయా స్టూడెంట్స్

టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. నారా లోకేష్ ను మంత్రిత్వ శాఖపై బురదజల్లే క్రమంలో చివరికి విద్యార్థులనూ పణంగా పెడుతోంది. టెన్త్ ఫలితాలు విడుదలయ్యాక కొన్ని పేపర్లలో తమకు తమకు సరిగా మార్కులు రాలేదు అని భావించినప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫిషన్ కు కోరడం ఎప్పటినుంచో సహజంగా జరిగే ప్రక్రియ. గత నాలుగేళ్లలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరిన విద్యార్థులు, ఆయా పేపర్లలో జరిగిన మార్పులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ కోసం 2022లో 41,694 దరఖాస్తులు రాగా, అందులో 8,235 స్క్రిప్టులు (20శాతం), 2023లో 61,887 దరఖాస్తులు రాగా, అందులో 10,987 స్క్రిప్టులు (18శాతం), 2024లో 55,930 దరఖాస్తులు రాగా, 9,231 (17శాతం), 2025లో 66,363 దరఖాస్తులు రాగా, 11,175 (18శాతం) స్క్రిప్టులకు సంబంధించి మార్కుల్లో మార్పులు రాగా, వాటిని సరిచేయడం జరిగింది.

ఈ ఏడాది ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు 6,14,459మంది విద్యార్థులు హాజరుకాగా, 34,709మంది విద్యార్థులు 66,363 పేపర్ల రీకౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10,159 మంది విద్యార్థులకు సంబంధించి 11,175 స్క్రిప్టుల్లో మార్కుల తేడాలను గమనించి సరిచేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన స్క్రిప్టుల్లో వ్యత్యాసం గుర్తించింది 0.0006 శాతం స్క్రిప్టుల్లో మాత్రమే. ఇది సాధారణ అంశమే. అయితే లోకేష్ పనితీరుపై తప్పుడు ప్రచారం ద్వారా లబ్ది అనేది వారి అంతిమ లక్ష్యం. ఇది వాస్తవం కాగా…దీన్ని అడ్డుపెట్టుకుని విద్యార్థులకు దారుణ అన్యాయం అని అందరినీ కన్ ఫ్యూజన్ లోకి నెట్టే కుట్ర అమలు చేస్తోంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా లక్షల మంది విద్యార్థులను మనసుల్లో అనుమానాలు నాటి వికృత చర్యలకు పాల్పడుతోంది.

Also Read: Telangana : కృత్రిమ మేధతో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం పునఃప్రారంభం

ఈ నాలుగు ఘటనలు మనం లోతుగా పరిశీలిస్తే.. వారి పోకడలు మరింత బాగా అర్ధం చేసుకోవచ్చు. అందుకే అంతా వైసీపీ కుట్రలు, ఆలోచనలు, రాజకీయ పోకడలు, ఫేక్ ప్రచారాలు, క్రిమినల్ ఐడియాలజీని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా అనునిత్యం అప్రమత్తంగా ఉండి వారిని ఎండగట్టాలి.

Exit mobile version