ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మార్పులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram ) నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం, పార్టీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేయడం విశేషంగా మారింది. వైసీపీ నుంచి అనేక మంది నేతలు వలస బాట పట్టడం, తమ భవిష్యత్తు రాజకీయాలను పునర్వ్యవస్థీకరించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
MLC Elections : టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం
ఒకప్పుడు టీడీపీ, వైసీపీకి చెందిన నేతలుగా వేర్వేరుగా ఉన్న దొరబాబు (Dorababu) ఇప్పుడు జనసేన గూటికి చేరడం ఆసక్తికర పరిణామంగా మారింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖాయంగా మారింది. మరోవైపు దొరబాబు జనసేనలో చేరడం ద్వారా పిఠాపురంలో జనసేన బలం మరింత పెరగనుంది. వీరిద్దరూ కలిసి ఎన్నికల బరిలో దిగితే, జనసేనకు పిఠాపురంలో గట్టి పట్టు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జనసేన వ్యూహం – పవన్ కళ్యాణ్ కసరత్తు
2019ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. అలాగే జనసేన కేవలం 1 స్థానం లో విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో జనసేన 22 స్థానాల్లో పోటీ చేసి భారీ విజయం సాధించింది. అలాగే పవన్ కళ్యా డిప్యూటీ సీఎం తో పాటు పలు శాఖలకు మంత్రిగా తన మార్క్ కనపరుస్తూ వస్తున్నాడు. దీంతో ప్రజల్లో మరింత ఆదరణ , మద్దతు పెరుగుతుంది. ఇదే క్రమంలో వైసీపీ నేతలు సైతం జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు. అలాగే జనసేన బలమైన ఆధిక్యం కలిగిన వెస్ట్ గోదావరి, పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో పాగా వేయాలని పవన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే, వైసీపీ నుంచి వలస వెళ్లే నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ, జనసేనను బలోపేతం చేస్తున్నారు. జనసేన అధినేత స్వయంగా వెస్ట్ గోదావరి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జనసేన వల్ల వైసీపీకి ముప్పా?
వైసీపీ నుంచి కీలక నేతలు వలసలు పెట్టడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడారు. ఉన్న నేతలను పలు కేసులు ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇక ఇప్పుడు వలసల పర్వం జగన్ ను నిద్ర పోనివ్వకుండా చేస్తున్నాయి. ఓవరాల్ గా పిఠాపురం లో కొనసాగుతున్న రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.