Site icon HashtagU Telugu

Pawan Warning : పవన్ హెచ్చరిక తో అలర్ట్ అయినా పోలీస్ శాఖ

Dgp Warning

Dgp Warning

రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల పోలీస్ శాఖ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిజాయతీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన ఆయన, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో పోలీస్ శాఖలో చలనం వచ్చింది.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి గట్టి హెచ్చరిక ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao). రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్, మనషులను వేధించడం వంటి వల్ల కొన్ని కుటుంబాలు మానసికంగా ఇబ్బంది పడుతున్నాయి.. ఈ క్రమంలో వీటిని కంట్రోల్‌ చేసేందుకు పోలీస్ శాఖ పూర్తి ఫోకస్ పెట్టబోతోంది.జిల్లాకొక సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమలరావు స్వయంగా చెప్పుకొచ్చారు. అనంతపురం వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో మనుషులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. మనషులను మానసికంగా బాధ పెట్టేలా సైబర్ క్రైమ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు.

మరోపక్క కూటమి ప్రభుత్వం, మంత్రులపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నవారిపై దృష్టి సారించారు పోలీసులు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నానిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read Also : YCP Leaders : అప్పుడు తిట్టారు..ఇప్పుడు ఆదుకోండి అని వేడుకుంటున్నారు