TDP : నేడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడీ మేనిఫెస్టో విడుదల

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 12:13 PM IST

Release of Ummadi Manifesto: ఏపిలో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడీ మేనిఫెస్టోను(Ummadi Manifesto) ఏన్డీఏ కూటమి విడుదల చేయనుంది. నేడు చంద్రబాబు(Chandrababu) నివాసంలో మేనిఫెస్టో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బీజేపీ ముఖ్య నేతల(BJP leaders) సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయననున్నారు. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది టీడీపీ. ఆ తరువాత కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి మూడు పార్టీలు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో ఈ మేనిఫెస్టోను తయారు చేశారు. బాదుడు లేని సంక్షేమం.. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామనే హామీని కూటమి ప్రజలకు ఇవ్వనుంది. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కాదని ప్రజలకు కూటమి నేతలు వివరించనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేసే డెవలప్‌మెంట్‌పై స్పష్టమైన రూట్ మ్యాప్‌తో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు సమాచారం. చంద్రబాబు నివాసంలో జరిగే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read Also: Raw Officer : గురుపత్వంత్ హత్యకు ‘రా’ అధికారి కుట్ర.. భారత్ స్పందన ఇదీ