YSR Jagananna Colonies : తమ పాలనా కాలంలో 17వేల వైఎస్సార్ జగనన్న కాలనీల కోసం రూ.55 వేల కోట్లను ఖర్చు పెట్టామని వైఎస్సార్ సీపీ గొప్పలు చెప్పుకుంటోంది. సొంత మీడియాలో దీనిపై ప్రచారం చేసుకుంటోంది. ఐదేళ్ల పాలనా కాలంలో 30 లక్షల ఇళ్లను పేదల కోసం కడతామని ప్రగల్భాలు పలికిన నాటి జగన్ సర్కారు.. కేవలం 3 లక్షల ఇళ్లనే కట్టింది. వాటిలోనూ చాలావరకు లబ్ధిదారులేే నిర్మించినట్లు సమాచారం. ఇక ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నాడు జగన్ సర్కారు చేపట్టిన భూసేకరణలో రూ.7,000 కోట్ల అవినీతి జరిగిందనే అరోపణలు ఉన్నాయి. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఆనాడు ఎంపిక చేసిన భూముల్లో ఎక్కువ శాతం నివాసయోగ్యం కానివే. తీవ్రమైన ముంపు ప్రాంతాలతో పాటు అటవీ భూములు, కొండలు, గుట్టలు, స్మశానాలు, చిన్న వర్షాలకే నీట మునిగే భూములనే లే అవుట్లుగా మార్చేసి పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతంలో సెంటు స్థలం, పల్లెలో సెంటున్నర స్థలం మాత్రమే పేదలకు కేటాయించారు. ఈ వాస్తవాలను వైఎస్సార్ సీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
Also Read :AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు
రూ.1.80 లక్షలు ఇచ్చి.. చేతులు దులుపుకొని..
పేదలకు ఇళ్లను కట్టిస్తామని చెబుతూ వచ్చిన జగన్ సర్కారు(YSR Jagananna Colonies).. చివరకు లబ్ధిదారులే ఆ ఇళ్లను కట్టుకోవాలంటూ కొర్రీ పెట్టింది. రూ.లక్షా 80 వేలు ఇస్తాం ఇల్లు కట్టుకోండి అంటూ ఆనాటి సర్కారు తేల్చి చెప్పింది. రూ.1.80 లక్షలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 30 వేలు అందాయి. అంటే ఇందులోనూ కేంద్ర ప్రభుత్వం వాటానే ఎక్కువ. వీటికి తోడుగా పావలా వడ్డీతో రూ.35 వేలు రుణం ఇచ్చారు. ఇక పేదల ఇళ్ల నిర్మాణ పనులు చేసిన పలువురు కాంట్రాక్టర్లకు రూ.3000 కోట్లకుపైగా దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు హౌసింగ్ అధికారులకు కమీషన్ల రూపంలో ముట్టాయని అంటున్నారు.
Also Read :Bilawal Bhutto: నీళ్లివ్వకుంటే.. సింధూనదిలో రక్తం పారిస్తాం : బిలావల్
కూటమి సర్కారు మహాసంకల్పం
జగన్ హయాంలో మొదలైన పేదల ఇళ్ల నిర్మాణ పనుల పూర్తికి ఏపీలోని కూటమి సర్కారు సహాయ సహకారాలను అందిస్తోంది. గత 9 నెలల్లో రూ.642.38 కోట్లతో ఏపీలో పేదల కోసం ఇళ్లను నిర్మించారు. పీఎంఏవై అర్బన్ స్కీం కింద 76,585 ఇళ్లు, పీఎంఏవై రూరల్ స్కీం కింద 37,746 ఇళ్లు, పీఎం జన్మన్ స్కీం కింద 1.14 లక్షల ఇళ్లను నిర్మించారు. .ఈ ఏడాది జూన్ నాటికి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి ఒకేరోజు పేదలకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలోని కూటమి సర్కారు సంకల్పం అంటే ఇలా బలంగా, కచ్చితంగా ఉంటుంది.