Amaravati : ఆగస్టు 15న అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభం!

Amaravati : రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన 3.62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం CRDA ప్రధాన కార్యాలయంగా ఉపయోగించబడనుంది

Published By: HashtagU Telugu Desk
Amaravati Ap Crda

Amaravati Ap Crda

 

అమరావతి (Amaravati ) అభివృద్ధి పునఃప్రారంభ దశలో కీలకమైన మైలురాయిగా, ఈ రాజధానిలో తొలి శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యింది. రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన 3.62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం CRDA ప్రధాన కార్యాలయంగా ఉపయోగించబడనుంది. ఏడు అంతస్తులతో కూడిన ఈ ఆధునిక భవనం నిర్మాణం తుది దశకు చేరుకుంది. దీన్ని ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈ భవన నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. మొత్తం 2.42 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో నిర్మించిన ఈ భవనంలో, అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, స్మార్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్, హైసెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం కూడా అర్ధరాత్రి దాకా పనులు జరుగుతూ, లైట్ల వెలుగులో కార్మికులు తుది మెరుగులు దిద్దుతున్నారు.

Rishabh Pant: ఇంగ్లాండ్‌తో నాల్గ‌వ టెస్ట్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్‌!

ఈ భవనంలో అత్యంత ముఖ్యమైన భాగంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా అమరావతి నగర పర్యవేక్షణ, అభివృద్ధి చర్యల మానిటరింగ్, విపత్తుల సమయంలో సమన్వయం వంటి కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. అమరావతిలో భవిష్యత్తులో ఏర్పడే ఇతర ప్రభుత్వ భవనాలకూ ఇది నమూనాగా నిలవనుంది.

ఈ కార్యాలయం ప్రారంభం ద్వారా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మళ్లీ ఊపొచ్చినట్లే భావిస్తున్నారు నిపుణులు. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు ఇది శుభప్రారంభంగా అభివర్ణించవచ్చు. ఇది తాత్కాలిక రాజధానుల చర్చకు ముగింపు పలికే దిశగా ముందడుగు కావచ్చు. అభివృద్ధి కోరుకునే ప్రజలకు ఇది ఊరట కలిగించే సంఘటనగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

  Last Updated: 21 Jul 2025, 08:02 AM IST