Central Govt : కేంద్ర ప్రభుత్వం కూటమి సర్కార్‌కు మరో తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఆయ గ్రామ పంచాయతీల బ్యాంక్ అకౌంట్లలో నిధులను ఆర్థిక శాఖ అనుమతితో పంచాయతీ రాజ్ శాఖ త్వరలోనే జమ చేయనుంది.
Read Also: Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..28 మంది మావోలు మృతి
దీంతో సుదీర్ఘకాలంగా మండల, జిల్లా పరిషత్ లు, పంచాయతీల్లో పనులు చేయడానికి వీలవుతుంది.మరోవైపు ఏపీప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పులు చేసింది. మండల, జిల్లా పరిషత్తుల్లోని 73 మంది పరిపాలనాధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సహాయ ప్రభుత్వ న్యాయవాదులను నియమించింది. హజ్ కమిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికను ఈ నెల 30న నిర్వహించనున్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి కార్యక్రమాలకు వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ చర్యలు రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. కేంద్రం నుండి వచ్చిన ఈ నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించడంతో పాటు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా కూడా ఒక అడుగు ముందుకేసింది. రాష్ట్ర ప్రజలు ఈ నిధుల సద్వినియోగం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతారని ఆశించవచ్చు.
Read Also: Bilawal Bhutto: నీళ్లివ్వకుంటే.. సింధూనదిలో రక్తం పారిస్తాం : బిలావల్