AP Gold Hub : ఏకంగా దుబాయ్ రేంజులో ఏపీలో గోల్డ్ హబ్ ఏర్పాటు కాబోతోంది. అది దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇంతకీ ఎక్కడ.. అని ఆలోచిస్తున్నారా ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Gaddar 77th Birth Anniversary Celebrations : గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు – భట్టి విక్రమార్క
ముంబైలోని నవీ ముంబైలో ఉన్న జువెల్లరీ పార్క్ ప్రస్తుతానికి వ్యాపార రీత్యా దేశంలోనే పెద్దది. కోల్‌కతా, కోయంబత్తూరులలో కూడా పెద్ద జువెల్లరీ పార్కులే ఉన్నాయి. వాటిని మించిన రేంజులో ఏపీలో జువెల్లరీ పార్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. ఏకంగా రూ.50వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు లక్షమందికి ఉపాధి కల్పించేలా ఏపీలో గోల్డ్ హబ్ ఏర్పాటవుతుందని అంటున్నారు.
Also Read :Delhi Assembly Elections : ఆప్‌కు గట్టిదెబ్బ.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..
ఇంతకీ ఎక్కడ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు కానుంది. ఈవిషయంలో మంత్రి నారా లోకేశ్ పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం. ఈ ప్రాంతంలో స్వర్ణకార వృత్తిదారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. దీంతో మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయిస్తానని నారా లోకేశ్ గతంలో హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. గోల్డ్ హబ్ ఏర్పాటైతే పరిసర ప్రాంతాల్లోని స్వర్ణకారులకు చేతినిండా పని దొరుకుతుంది. దాదాపు 12 వేలమందికి ఉపాధి లభిస్తుంది.
గోల్డ్ హబ్ లొకేషన్..
మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంటనున్న అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంతం పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్‌హబ్(AP Gold Hub) ఏర్పాటుకానుంది. ఆత్మకూరు సర్వే నంబర్లు 133, 134, 135, 136లలో ఉన్న ప్రభుత్వ ఖాళీ, అసైన్డ్ భూముల్లో జిల్లా అధికారులు దాదాపు 60 ఎకరాలను గోల్డ్ హబ్ నిర్మాణానికి ఎంపిక చేశారు. రెండు మూడు నెలల్లోనే అక్కడ జువెల్లరీ పార్కు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్‌హబ్‌లో రత్నాలు, బంగారంతో కూడిన ఆభరణాలను తయారు చేస్తారు. ఈ ఆభరణాలకు తరుగు తక్కువస్థాయిలో ఉంటుంది. ఈ పార్కులో కొనుగోలుదారులకు తరుగు మూడు శాతమే ఉంటుంది.
ముక్కుపుడక నుంచి వడ్రాణం వరకు..
ముక్కుపుడక నుంచి వడ్రాణం వరకు అన్నిరకాల మోడళ్లలో ఆభరణాలను తయారు చేసేందుకు అవసరమైన మిషనరీ ఈ పార్కులో అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన టెస్టింగ్ ల్యాబ్‌లతో సహా అవసరమైన సౌకర్యాలన్నీ ఉంటాయి. మంత్రి లోకేశ్ సొంత ఖర్చులతో ఎల్‌ఎన్ గోల్డ్‌స్మిత్ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను స్థాపించి మంగళగిరిలోని స్వర్ణకారులందరికీ ఆధునిక డిజైన్ల తయారీపై శిక్షణ ఇప్పించబోతున్నారు.