ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam )పథకానికి సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఈ పథకం కింద మొదటి విడతగా అర్హులైన లబ్ధిదారులకు నగదు పంపిణీ జరిగింది. ఎన్నికల హామీ మేరకు పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకొని, ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా, జూలై 2వ తేదీ సాయంత్రం వరకు ఏ స్కూల్లో అయినా ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు మాత్రమే మొదటి విడత నగదు మంజూరు కానుంది.
Zohran Mamdani : ట్రంప్ బెదిరింపులకు భయపడను.. ట్రంప్‌కు జోహ్రాన్ మమ్దానీ కౌంటర్
రెండో జాబితా ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలకు చేరింది. అర్హులై ఉండీ నగదు అందని తల్లుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వచ్చిన అభ్యర్థనలపై పునఃపరిశీలన కొనసాగుతోంది. అలాగే, డబ్బులు అందని వారు, లేటుగా అడ్మిషన్ అయిన వారు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు కూడా ఈ పథకం కింద అర్హులైతే జూలై 5న వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. దీనితోపాటు అధికార యంత్రాంగం రెండో విడతకు సంబంధించి లబ్ధిదారుల వెరిఫికేషన్‌ను వేగంగా పూర్తి చేస్తోంది.
మీరు ఈ పథకానికి అర్హులా? మీ పేరు రెండో జాబితాలో ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన https://gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ “తల్లికి వందనం” పథకం ఎంపిక చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వివరాలు లభిస్తాయి. అదే విధంగా, మన మిత్ర వాట్సాప్ నంబర్ (+91 9552300009) ద్వారా కూడా మీ పేరు జాబితాలో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా విద్యార్ధులకు ఉత్తమ విద్య అందించడంతోపాటు తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.