ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు (Anna Canteen) పేద ప్రజల ఆకలి తీరుస్తుంది. కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తూ నిరుపేదలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులకు ఆశాజనకంగా మారింది. సామాన్య ప్రజలతో పాటు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా అన్న క్యాంటీన్ల భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా ప్రముఖ డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar), జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్.. “తల” సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న రాగిణి రాజ్ విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌లో భోజనం చేశారు. సామాన్యుల్లాగే క్యూలో నిలబడి టోకెన్ తీసుకొని, అందరితో కలసి భోజనం చేశారు.
America : భారత వలసదారుల తరలింపు పై అమెరికా స్పందన..
దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. తమ సినిమా ప్రమోషన్ నిమిత్తం విశాఖపట్నం వచ్చామని, ఆకలి వేయడంతో అన్న క్యాంటీన్ వద్ద భోజనం చేయడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రభుత్వమే స్వయంగా నాణ్యమైన భోజనం అందించడం గొప్ప విషయమని, ఇది పేద ప్రజలకు నిజమైన వరమని అన్నారు. నటుడు రాగిణి రాజ్ కూడా తన అనుభవాన్ని పంచుకుంటూ, సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేయడం ఓ చిరస్మరణీయమైన అనుభూతి అని తెలిపారు. ఆకలి వేయగా తక్కువ ఖర్చుతో మంచి భోజనం దొరకడం ఎంతో సంతోషకరమని, ఈ విధమైన సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలి అని అభిప్రాయపడ్డారు. అన్న క్యాంటీన్లను 2018లో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించగా, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ప్రస్తుతం టీడీపీ సర్కార్ అధికారంలోకి రావడం తో మళ్లీ అన్న క్యాంటీన్ లను ఓపెన్ చేసింది.