కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. నిన్న అవనిగడ్డలో వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ జనసేన నేతలు నిరసన తెలిపారు. అయితే నిరసనలను ఓర్చుకోలేని ఎమ్మెల్యే, అతని అనుచరులు జనసేన కార్యకర్తలపై నేరుగా దాడికి పాల్పడ్డారు. దీంతో జనసేన టీడీపీ నేతలు ఎమ్మెల్యే రమేష్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అవనిగడ్డ బంద్‌కు రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే బంద్‌కు ఎవరూ సహకరించకూడదంటూ పోలీసులు హుకుంజారీ చేశారు. షాపులు మూసివేసిన వ్యాపారులను భయపెట్టి మళ్లీ షాపులను పోలీసులు తెరిపిస్తున్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.జనసేన కార్యకర్తలపై ఎమ్మెల్యే దాడి చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసైనికులపై దాడి జరిగిన నేపథ్యంలో అవనిగడ్డకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాకుండా అవనిగడ్డ నలు వైపులా పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు.
Also Read: Andhra Pradesh : ఏపీలో 16 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ