Site icon HashtagU Telugu

Amaravati : అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు

Tenders finalized for construction of Integrated State Secretariat and HOD towers in Amaravati

Tenders finalized for construction of Integrated State Secretariat and HOD towers in Amaravati

Amaravati : అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ (HOD) టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, వాటిలో లొయెస్ట్ బిడ్డర్లను (L1) ఖరారు చేసింది. ఆయా సంస్థలకు బిడ్లు మంజూరు చేస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రాంతంలో మూడు భాగాలుగా విభజించి పనులు అప్పగించబడ్డాయి. ఇందులో భాగంగా జీఏడీ (GAD) టవర్ నిర్మాణానికి ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ లభించింది. ఈ సంస్థ రూ.882.47 కోట్ల వ్యయంతో జీఏడీ టవర్‌ను నిర్మించనుంది. ఈ టవర్‌ GAD శాఖలతో పాటు ప్రధాన కార్యాలయాల కేంద్రంగా పనిచేయనుంది.

Read Also: ACB searches : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

ఇక, హెచ్‌ఓడీ 1, 2 టవర్ల నిర్మాణ బాధ్యతలు దేశవ్యాప్తంగా పేరుగాంచిన షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థకు దక్కాయి. ఈ సంస్థ రూ.1487.11 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులను చేపట్టనుంది. ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రధానాధికారుల కార్యాలయాలు, సంబంధిత విభాగాల కార్యనిర్వాహక కేంద్రాలుగా ఈ టవర్లు వాడుకలోకి రానున్నాయి. అదే విధంగా, హెచ్‌ఓడీ 3, 4 టవర్ల నిర్మాణ బాధ్యతలు ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టౌబ్రో (L&T) లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ నిర్మాణం కోసం రూ.1303.85 కోట్ల నిధులు మంజూరయ్యాయి. లార్సెన్ అండ్ టౌబ్రో ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనుభవాన్ని కలిగి ఉండటంతో, అమరావతి నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించనుంది.

మొత్తం మూడు సంస్థలకు కేటాయించిన నిర్మాణ వ్యయం రూ.3673.43 కోట్లు కాగా, ప్రతిపాదిత పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం CRDA కమిషనర్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగిస్తూ, పనులపై పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించింది. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ సురేశ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ పనులు సమయానికి పూర్తి చేయడం ద్వారా అమరావతిని రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తోంది.

Read Also:  Warning : ఉగ్రవాదులకు భారత్ హెచ్చరిక