AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు(AP Elections) పోటెత్తుతున్నారు. దీంతో భారీగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 10 శాతం పోలింగ్ నమోదైంది.
We’re now on WhatsApp. Click to Join
ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విజయవాడ తూర్పులో అత్యధికంగా 12 శాతం ఓటింగ్ జరిగింది. జగ్గయ్యపేటలో 11 శాతం, విజయవాడ పశ్చిమలో 11 శాతం పోలింగ్ నమోదైంది. తిరువూరులో 10 శాతం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9.18 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం, తిరుపతి జిల్లాలో 8.11 శాతం, విజయవాడ సెంట్రల్‌లో 8.09 శాతం ఓటింగ్ జరిగింది. సత్యసాయి జిల్లా లో 6.92 శాతం, శ్రీశైలంలో 6.21 శాతం, మైలవరంలో 6 శాతం, బనగానపల్లిలో 5.32 శాతం, నంద్యాలలో 5.22 శాతం, నంద్యాల జిల్లాలో 5.10 శాతం పోలింగ్ నమోదైంది. నందిగామలో 4.46 శాతం, ఆళ్లగడ్డలో 4.90 శాతం, డోన్‌లో 4.75 శాతం, నందికొట్కూర్‌లో 4.29 శాతం ఓటింగ్ జరిగింది. పల్నాడు లాంటి ప్రాంతాల్లో పలు పోలింగ్ స్టేషన్ల వద్ద కొంతమేర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది.
Also Read :Putin : రష్యా రక్షణ మంత్రి ఔట్.. పుతిన్ సంచలన నిర్ణయం
ఏపీలోని పల్నాడు జిల్లాలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. దాచేపల్లిలోని కేసనపల్లి గ్రామంలో ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకు వెళ్లే విషయంలో వైసిపి టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో టిడిపి, వైసీపీ నేతలు గాయపడ్డారు. అలాగే రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటన ఫై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Rahul Gandhi : కేంద్రంలో జూన్4న ఇండియా కూటమి ప్రభుత్వం: రాహుల్ ధీమా
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభం కాగానే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓటింగ్ కోసం 46,389 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, ఇందులో 4.14 కోట్ల మంది ఓటర్లు 2,841 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.