Telugu states : గెలుపుకు రాజ‌శ్యామ‌ల‌!మంత్రాల‌తో నిధులు! యాగాల‌తో ఓట్లు!

Telugu States : ప్ర‌జ‌ల్ని ఒప్పించాలి లేదంటే తిక‌మ‌క పెట్టాలి. కానీ వాటి కంటే ఇప్పుడు బ‌ల‌హీన‌త మీద కొట్ట‌డాన్ని అల‌వాటు చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - June 9, 2023 / 03:27 PM IST

Telugu States : ప్ర‌జ‌ల్ని ఒప్పించాలి లేదంటే తిక‌మ‌క పెట్టాలి. ఇదీ ఒక‌ప్ప‌టి రాజ‌కీయ సూత్రం. కానీ వాటి కంటే ఇప్పుడు బ‌ల‌హీన‌త మీద కొట్ట‌డాన్ని అల‌వాటు చేసుకున్నారు. యాగాలు, పూజ‌లు, పండుగ‌ల పేర్ల‌తో ప్ర‌జా బ‌ల‌హీన‌త‌ను ఓట్లుగా మార్చుకుంటున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి క్షుద్ర‌పూజ‌ల‌ను చేస్తున్నార‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ఒకానొక స‌మ‌యంలో కేసీఆర్ (KCR) మీద మండిప‌డ్డారు. ఇదే రీతిలో బీజేపీ మీద బీఆర్ఎస్ నేత‌లు ఆరోపించిన సంద‌ర్భాలు అనేకం. వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌ధానంగా యాగాలు, పూజ‌లు, పండుగ‌ల చుట్టూ తిప్ప‌డానికి రాజ‌కీయ పార్టీలు ప్లాన్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ ఒర‌వ‌డి ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.

కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్మాత్మిక‌ అడుగులు (Telugu States)

ఏ రాష్ట్రం ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని విధంగా ప్ర‌జాధ‌నంతో ఏపీ ప్ర‌భుత్వం ల‌క్ష్మీ రాజ‌శ్యామ‌ల యాగం చేయించింది. మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డానికి రుద్ర‌యాగం, రాజ‌శ్యామ‌ల‌యాగం చేయించిన‌ట్టు ప్ర‌త్య‌ర్థులు ఆరోపించారు. పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల్గొన‌డం ప్ర‌త్య‌ర్థులు ఆరోప‌ణ‌ల‌కు బ‌లంచేకూరేలా ఉంది. వారం రోజుల పాటి విజ‌య‌వాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జ‌రిగిన ఈ యాగాలు ఫ‌లించాయ‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. పెండింగ్‌లో ఉన్న నిధులు కేంద్రం నుంచి రావ‌డానికి కార‌ణం యాగాలని దేవాదాయ‌శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ(Telugu States) చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jagan Family Drama : అంతఃపురంలో అల‌జ‌డి! విజ‌య‌మ్మ‌కు మొఖంచాటేసిన‌ సజ్జ‌ల‌!

ఏపీకి 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.10,461 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా ఈ నిధులను మంజూరు చేసింది. ఇక పోల‌వ‌రం ప్రాజెక్టుకు అందాల్సిన నిధుల్లో సుమారు 12వేల కోట్ల వ‌ర‌కు విడుద‌ల చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తిరుప‌తికి శ్రీనివాస సేతు ప్రాజెక్టు స్మార్ట్ సిటీ కింద వచ్చింది. ఇవ‌న్నీ యాగాల కార‌ణంగా సాధ్య‌మ‌య్యాయ‌ని మంత్రి చెప్ప‌డం వెనుక రాజ‌కీయ కోణం లేక‌పోలేదు. తొలి నుంచి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ గా ముద్ర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాల‌యాల్లో జ‌రిగిన దాడులు, విగ్ర‌హాల కూల్చివేత‌లు, ర‌థాలు కాల్చివేత త‌దిత‌రాల‌న్నీ ఆయ‌న్ను హిందూ వ్య‌తిరేకిగా చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌హ‌క‌రించాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు వెళ్లిన సంద‌ర్భంగా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని హైలెట్ చేస్తూ క్రిస్టియ‌న్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం జరిగింది.అయితే, విశాఖ శార‌ద‌ పీఠాధిప‌తి స్వ‌రూపానందంద్రే స‌ర‌స్వ‌తి(Telugu States) వ‌ద్ద‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్ల‌డం క్రిస్టియ‌న్ ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డుతూ వ‌స్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థుల అభిప్రాయం.

రాష్ట్రంలోనూ ప్ర‌ధాని కావ‌డానికి ఢిల్లీలోనూ పూజ‌లు, యాగాలు

వాస్త‌వంగా 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావాల‌ని రాజ‌శ్యామ‌ల యాగాన్ని నిర్విరామంగా జ‌ర‌ప‌డానికి వైసీపీ నిధుల‌ను స‌మ‌కూర్చింద‌ని చెబుతుంటారు. పూర్ణాహుతి కార్య‌క్ర‌మాల్లో సీఎం అయిన త‌రువాత కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ముహూర్తం కూడా స్వ‌రూపానందేంద్ర‌స్వామి పెట్టార‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ మూఢ‌న‌మ్మ‌కాల గురించి జ‌గ‌ద్వితం. ఆయ‌న సీఎం అయిన త‌రువాత ఫాంహౌస్ లో చేసిన చండీ, రాజ‌శ్వామ‌ల త‌దిత‌ర యాగాలు ఎన్నో ఉన్నాయి. రెండోసారి సీఎం కావ‌డానికి చేసిన పూజ‌లు (Telugu States)కూడా ఫ‌లించాయి. ఇప్పుడు మూడోసారి సీఎం కావ‌డానికి రాష్ట్రంలోనూ ప్ర‌ధాని కావ‌డానికి ఢిల్లీలోనూ పూజ‌లు, యాగాలు చేయిస్తున్నారు.

మూడేళ్ల క్రితం  ఇద్ద‌రు సీఎంలు ఆ స్వాముల‌కు పూలాభిషేకం 

త్రిదండి చిన చియ్య‌ర్ స్వామి, విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందంద్రే స‌ర‌స్వ‌తి సామి రెండు తెలుగు రాష్ట్రాల్లోని(Telugu States) సీఎంల‌కు దిశానిర్దేశ‌కులు. ఆ ఇద్ద‌రు స్వాముల ఆశీస్సులు, డైరెక్ష‌న్ మేర‌కు కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్మాత్మిక‌ అడుగులు వేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆ స్వాముల‌కు పూలాభిషేకం ఇద్ద‌రు సీఎంలు చేశారు. పీఠాల‌కు ప్ర‌త్యేకంగా భూములు కేటాయించారు. తాజాగా రాజ‌శ్యామ‌ల దేవాల‌యం నిర్మాణానికి కోకా పేట‌తో సీఎం కేసీఆర్ విలువైన రెండున్న‌ర ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించారు. ముచ్చింత‌ల్ రామానుచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా పొడ‌చూపిన ప్రొటోకాల్ ర‌గ‌డ సీఎం కేసీఆర్ కు చియ్య‌ర్ ను తాత్కాలికంగా దూరం చేసింది. ఇప్పుడు ఇద్ద‌రు (Telugu States) సీఎంల‌కు స్వ‌రూపానందంద్రేస్వామి యాగాలు, పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు చెప్పుకుంటున్నారు. ప్ర‌జాధ‌నంతో ఆధ్యాత్మిక కోర్కెలు, ఆశ‌ల‌ను ఇద్ద‌రు సీఎంలు తీర్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : KCR strategy : ఆంధ్రాను గేలిచేస్తోన్న కేసీఆర్! నోరెత్తని ఏపీ పాల‌కులు!!

యాగాలు, పూజ‌ల‌కు తోడుగా ఇప్పుడు ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవ‌డానికి 105 కోట్ల‌కు పైగా నిధుల‌ను సీఎం కేసీఆర్ కేటాయించారు. తెలంగాణ ఆవిర్భావం తొమ్మిదేళ్ల‌కు ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, గంగా పుష్క‌రాల‌కు స‌మాంత‌రంగా మంజీరా పుష్క‌రాల‌ను చేయించారు. ఇప్పుడు చెరువుల పండుగ‌ను చేయిస్తున్నారు. సంస్కృతి, సంప్ర‌దాయాలు, యాగాలు, పూజ‌ల‌తో ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడుతూ ప్ర‌జా బ‌ల‌హీన‌త‌ను ఓట్ల రూపంలో పొంద‌డానికి ప్లాన్ చేశారు. ఇదే త‌ర‌హాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌త విశ్వాసాలను చూపుతూ క్రిస్ట‌య‌న్ ఓటు బ్యాంకుతో పాటు హిందూ ఓట్ల‌ను సానుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకు కొంద‌రు స్వామీజీలు, మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు(Telugu States) స‌హ‌కారం అందించ‌డం కొస‌మెరుపు.

Also Read : Political king pin : BRS, కాంగ్రెస్ జాత‌కాల‌ను మార్చ‌నున్న MIM