చిత్రసీమ హీరోల (Tollywood Heros)పై తెలుగు ప్రజలు ఎంత అభిమానం , ప్రేమ చూపిస్తారో తెలియంది కాదు..తమ అభిమాన హీరో సినిమా విడుదలైన , పుట్టిన రోజులైనా తమ సొంత డబ్బుతో భారీగా వేడుకలు జరుపుతుంటారు. భారీగా ప్లెక్సీ లు , కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అంతే కాదు తమ హీరో తమ నగరానికి వచ్చాడంటే ఎన్నో గంటలు వెయిట్ చేసి ఆ హీరోను చూసి వెళ్తారు. అంతే కాదు మొదటి రోజు మొదటి షో చూసేందుకు పోటీ పడతారు..టికెట్ ధర ఎంత ఉన్న సరే చూస్తారు..హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు..మరో జనాలు ఆపద లో ఉంటె వారు ఏంచేస్తున్నారు..? సాయం చేయడం కాదు కదా..అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే…తమవంతు సాయం చేద్దాం..అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఆగ్రహం నింపుతుంది.
గత నాల్గు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Telugu States Floods ) పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లు , రైల్వే ట్రాక్ లు , బ్రిడ్జ్ లు , భవనాలు , పంటపొలాలు, ఇల్లులు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వరదల కారణంగా మృతి చెందారు. ఇక విజయవాడ నగరం గురించి ఎంత చెప్పిన తక్కువే..30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంత దారుణమైన పరిస్థితి లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటె…తెలుగు హీరోలు కానీ సినీ ప్రముఖులు కానీ ఎవ్వరు స్పదించకపోవడం..ముందుకు వచ్చి మేమున్నాం అని ముందుకు వచ్చింది లేదు. ఇండియాలో మా అంత గొప్ప హీరోలు లేరని చెప్పుకునే పాన్ ఇండియా తెలుగు హీరోలు.. కష్టాల్లో ఉన్న ప్రజలకు తాము ఉన్నామని కనీస భరోసా కూడా ఇవ్వలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు దేవుళ్లతో సమానం చెప్పే హీరోలెవ్వరూ ప్రజలకు అండగా నిలిచింది లేదు. అదే తమిళనాడులో భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ హీరోలు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు సాయం చేశారు. మరికొందరు ఆర్ధికంగా ప్రజలను ఆదుకున్నారు. మరి మన హీరోలు ఎటుపోయారు..? టికెట్స్ ధరలు పెంచాలని ప్రత్యేక విమానంలో వచ్చి అడిగే వారు..ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తమకు తోచిన సాయం చేద్దామని ఎందుకు ముందుకు రావడం లేదు..? వారివేన ప్రాణాలు..వారివేన డబ్బులు..వారివేన సంతోషాలు..వారేనా మనుషులు..మీము కదా..మీము సినిమాలు చూస్తూనే మీకు డబ్బులు , తిండి..అవి మరచిపోకండి అని హెచ్చరిస్తున్నారు.
Read Also : AP Floods : ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ..?