Petrol & Diesel Prices : తెలుగు రాష్ట్రాల సీఎంల‌పై మోడీ దెబ్బ‌

ఎక్కి పెళ్లి సుబ్బిచావుకొచ్చిన‌ట్టు...ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు మెడ‌కు చుట్టుకుంది. కేంద్రం త‌గ్గించిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల మాదిరిగానే కేసీఆర్‌, జ‌గ‌న్ త‌గ్గించాల‌ని డిమాండ్ బ‌లంగా వినిపిస్తోంది. పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 10లు త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 04:04 PM IST

ఎక్కి పెళ్లి సుబ్బిచావుకొచ్చిన‌ట్టు…ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు మెడ‌కు చుట్టుకుంది. కేంద్రం త‌గ్గించిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల మాదిరిగానే కేసీఆర్‌, జ‌గ‌న్ త‌గ్గించాల‌ని డిమాండ్ బ‌లంగా వినిపిస్తోంది. పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 10లు త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీని ఆ మేర‌కు త‌గ్గించింది. ఇక వ్యాట్ రూపంలో రాష్ట్రాలు భారీగా పెట్రోలు, డీజిల్ రూపంలో వ‌సూలు చేస్తున్నాయి. క‌నీసం రూ. 30ల‌కు పైగా లీడ‌ర్ కు వ్యాట్, ఇత‌ర‌త్రా రూపంలో తెలుగు రాష్ట్రాలు దోచుకుంటున్నాయి. వ్యాట్ శాతాన్ని త‌గ్గించాల‌ని ప్ర‌జల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల గురించి ప్ర‌తి వేదిక‌పైనా జ‌గ‌న్ మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాల కంటే త‌క్కువ‌గా ఆయిల్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తాన‌ని హామీ ఇచ్చాడు. జ‌నం నిజ‌మ‌నుకుని ఓట్లు వేసి తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. కానీ, ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న ఇచ్చిన హామీకి భిన్నంగా స‌రిహ‌ద్దుల్లోని రాష్ట్రాల అన్నింటి కంటే ఎక్కువ‌గా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌పై వ్యాట్ ను వేశాడు. మిగిలిన రాష్ట్రాల కంటే టాప్ లో డీజిల్‌, పెట్రోలు ధ‌ర‌లు ఏపీలో ఉన్నాయి.

నిలువునా మాట‌త‌ప్పిన జ‌గ‌న్ మీద స‌మ‌యం చూసి చంద్ర‌బాబు తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. ఈనెల 9వ తేదీన పెట్రోలు బంకుల వ‌ద్ద జ‌నం ఆందోళ‌న చేయాల‌ని పిలుపునిచ్చాడు. టీడీపీ శ్రేణులు ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆ రోజున ఉద్య‌మించాల‌ని బాబు ఆదేశించాడు. ఎన్నికల ప్ర‌చారంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీని తెర‌ల‌పై పెట్రోలు బంకు వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని నిర్ణ‌యించాడు. వ్యాట్ ను త‌గ్గించాల‌ని కోరుతూ ధ‌ర్నాల‌కు బాబు పిలుపు నివ్వ‌డం ద్వారా జ‌గ‌న్ మాట త‌ప్పిన విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి టీడీపీ సిద్ధం అయింది.

Also Read : 9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!

పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌పై వ్యాట్ ను ప‌లుమార్లు కేసీఆర్ పెంచాడు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించుకోవాల‌ని మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ ప‌లు వేదిక‌ల‌పై డిమాండ్ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కూడా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల అంశాన్ని కేంద్రంపై నెట్టే ప్ర‌య‌త్నం గులాబీ నేత‌లు చేశారు. ఇప్పుడు కేంద్రం కొంత మేర‌కు త‌గ్గించ‌డంతో బీజేపీ నేత‌లు టీఆర్ ఎస్ ను నిల‌దీస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాట్ ను త‌గ్గించుకోవాల‌ని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద ఇరు రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ త‌గ్గించాల‌ని ఒత్తిడి పెరుగుతోంది.