TDP – YCP : సీట్ల ప్ర‌క‌ట‌నలో వైసీపీ దూకుడు.. టీడీపీలో ఇంకా తేల‌ని సీట్ల పంచాయ‌తీ

త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల‌కు అన్ని రాజ‌కీయ పార్టీలు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ టికెట్ల

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 09:04 AM IST

త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల‌కు అన్ని రాజ‌కీయ పార్టీలు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ టికెట్ల ప్ర‌క‌ట‌న‌తో దూసుకెళ్తుంది. 38 మందిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా అధిష్టానం నియ‌మించింది. దాదాపుగా వీరే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని వైసీపీ వ‌ర్గాలు తెలిపాయి. మూడో విడ‌త‌లో మ‌రికొన్ని సీట్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే వాటిపై అధిష్టానం క‌స‌రత్తు చేస్తుంది. ఇటు టికెట్ రాని ఎమ్మెల్యేలు ప‌లువురు పార్టీలు మారుతున్నారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. స‌ర్వేల రిపోర్టుల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నామ‌ని వైసీపీ అంటుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలుపే ల‌క్ష్యంగా వైసీపీ పావులు క‌దుపుతుంది. భారీగా ఎమ్మెల్యేల‌ను మార్చి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతుంది.ఇటు పార్ల‌మెంట్ స్థానాల్లో కూడా కొత్త అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపుతుంది.గ‌త ఎన్నిక‌ల్లో 22 ఎంపీ స్థానాల‌ను గెలుచుకున్న వైసీపీ ఈ సారి కూడా అన్ని స్థానాల‌ను గెల‌వాల‌ని భావిస్తుంది. ప‌లువురు సిట్టింగ్ ఎంపీల‌ను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేల‌ను ఎంపీలుగా స్థాన‌చ‌ల‌నం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు ప్ర‌తిప‌క్ష టీడీపీ మాత్రం సీట్ల విష‌యంలో ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న ఇంఛార్జ్‌ల‌ను అభ్య‌ర్థులు బ‌రిలోకి దింపితే టీడీపీకి గెలుపు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జ్‌ల ప‌నితీరు బాగాలేద‌నే రిపోర్టులు అధిష్టాన‌నాకి వెళ్లాయి. అయితే ప‌నితీరు స‌రిగాలేని వారిని తీసేస్తామ‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా ఇంకా వాటిమీద దృష్టిసారించ‌లేదు. ఇటు జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో ఎన్ని సీట్లు కేటాయిస్తార‌నే దానిపై ఇంకా సందిగ్థ‌త కొన‌సాగుతుంది. ప‌లుమార్లుల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, టీడీపీ అధినేత చంద్రబాబు స‌మావేశామైన‌ప్ప‌టికీ సీట్ల విషయంలో క్లారిటీ రాలేదు. ఒక పక్క వైసీపీ సీట్లు ప్ర‌క‌టించి దూకుడు మీదుంటే.. టీడీపీలో సీట్ల పంచాయ‌తీ తేల‌క‌పోవ‌డంతో క్యాడ‌ర్ ఆందోళ‌న‌లో ఉంది. సంక్రాంతి త‌రువాత టీడీపీ జ‌న‌సేన సీట్ల కేటాయింపులో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కూడా నామినేష‌న్ల వ‌ర‌కు టికెట్లు కేటాయించ‌క‌పోవ‌డంతోనే నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు ఓడిపోయార‌ని.. మ‌ళ్లీ అదే రిపీట్ అయితే పార్టీకి న‌ష్టం జ‌రిగింద‌ని క్యాడ‌ర్ అంటుంది.

Also Read:  Fake Drugs : హైద‌రాబాద్‌లో భారీగా న‌కిలీ డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌