TDP : వచ్చే ఎన్నికల్లో జ‌గ‌న్‌ను ఇంటికి పంపుదామంటూ పిలుపిచ్చిన తెలుగు మ‌హిళలు.. ఏపీలో మహిళల భద్రతపై..?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం

Published By: HashtagU Telugu Desk
Tdp

Tdp

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు విమర్శించారు. ఇటీవల వెలుబడిన ఎన్సీఆర్బీ నివేదిక‌కు సంబంధించిన వివరాలపై టీడీపీ మ‌హిళా నేత‌లు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, పిల్లలపై నేరాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా డేటాను సూచిస్తుందని తెలుగు మహిళలు పేర్కొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై మ‌హిళా నేత‌లు ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని మాజీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఏడాది విడుదల అయిన ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం 2022లో లైంగిక దాడి వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2022లో మహిళలపై నేరాల కేసుల సంఖ్యలో 25,503 కేసులను నమోదుతో దేశంలో ఆరవ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2022లో 3,308 పిల్లలపై నేరాల కేసులు నమోదయ్యాయని చెప్పిన వారు 2021 తో పోల్చితే 24 శాతం ఎక్కువ పెరిగాయని స్పష్టం చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి ఏపీ ఐదో స్థానానికి తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాని దని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని నన్నపనేని రాజకుమారి గుర్తు చేశారు. మహిళ భద్రతకు భరోసా ఇవ్వడంలో వైఎస్సార్‌సీ ప్రభుత్వం విఫలమైనందని పేర్కొన్నారు. సైకో ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉంటాయి అనడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మచ్చుతునక అని స్పష్టం చేశారు. జగన్ పాలనలో మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ తమ ఓటు హక్కు ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని తరిమి కొట్టాని హితవు పలికారు.

Also Read:  TDP : ఏపీ డీజీపీకి టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య‌ లేఖ.. పోలీసుల‌పై దాడులు చేస్తున్న వైసీపీ నేతల్ని..?

  Last Updated: 13 Dec 2023, 08:06 AM IST