TDP Win :వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది ? ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో పబ్లిక్ మూడ్‌ను తెలుసుకునేందుకు చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం దిశగా ఏపీ అడుగులు వేస్తోందని సర్వేలో వెల్లడైంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 115 చోట్ల టీడీపీ (TDP), జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉందని నివేదిక పేర్కొంది. గరిష్ఠంగా ఈ కూటమికి 128 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపింది. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీకి 42 నుంచి 55 సీట్లే వస్తాయని సర్వేలో గుర్తించారు. ఇక ఇతరులకు కేవలం 4 నుంచి 7 సీట్లే వస్తాయని తేలింది.
We’re now on WhatsApp. Click to Join.
సర్వే నివేదిక ప్రకారం..
- ఏపీలోని ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే.. ఉమ్మడి తూర్పు గోదావరిలోని 19 సీట్లకుగానూ 16 టీడీపీ (TDP), జనసేన కూటమి ఖాతాలోకి(TDP Win) వస్తాయి.
- ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 సీట్లకుగానూ 12 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
- ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని 16 సీట్లకుగానూ 12 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
- ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 15 సీట్లకుగానూ 11 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 సీట్లకుగానూ 12 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
- ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో చెరో 14 సీట్లు ఉన్నాయి. కర్నూలులో టీడీపీ కూటమికి 5, అనంతపురంలో టీడీపీ కూటమికి 10, చిత్తూరులో టీడీపీ కూటమికి 7 సీట్లు రావచ్చని సర్వే నివేదిక అంచనా వేసింది.
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 సీట్లకుగానూ 8 చోట్ల టీడీపీ, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది.
- ఉమ్మడి నెల్లూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో చెరో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. టీడీపీకి కూటమికి నెల్లూరులో 6, శ్రీకాకుళంలో 8, కడపలో 4 సీట్లు రావచ్చని నివేదిక తెలిపింది.
- ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ సీట్లకుగానూ 4 చోట్ల టీడీపీ కూటమి విజయఢంకా మోగిస్తుందని నివేదిక చెప్పింది.