MLA Koneti Adimulam Suspended : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈమేరకు టీడీపీ ఏపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read :RBI Quiz : స్టూడెంట్స్‌కు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు.. రూ.10 లక్షల దాకా ప్రైజ్‌మనీ
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను బాధితురాలు తాజాగా విడుదల చేసింది. టీడీపీ మహిళా నాయకురాలైన సదరు మహిళ దీనిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాసింది. తనపై ఎమ్మెల్యే మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌లను కోరింది. దీంతో ఈ అంశాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్(MLA Koneti Adimulam Suspended) చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.
Also Read :Trifoldable Phone: ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే రిలీజ్
కోనేటి రాసలీలలపై విచారణ చేసి, నిజాలను నిగ్గు తేల్చాలని తిరుపతి పోలీస్ అధికారులకు ఆదేశాలకు జారీ అయినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కోనేటి ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇవ్వడానికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్ నిరాకరించారు. ఆయనకు పొమ్మనకుండా పొగ బెట్టేలా తిరుపతి టికెట్‌ను వైఎస్సార్ సీపీ ఆఫర్ చేసింది. దీంతో ఆదిమూలం టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి సత్యవేడు టికెట్‌ను ఆదిమూలం దక్కించుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సునామీలో ఆయన గెలిచారు. అయితే స్వల్ప మెజార్టీ మాత్రమే సాధించగలిగారు. కోనేటి ఆదిమూలం రాజకీయ మూలాల్లోకి వెళితే.. ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే మొదలైంది. గతంలో నారాయణవనం నుంచి టీడీపీ తరపున జెడ్పీటీసీగా గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. తాజాగా ఆయనపై వచ్చిన అభియోగాలు మొత్తం పొలిటికల్ కెరీర్‌కు పెద్ద మచ్చలా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.