Site icon HashtagU Telugu

TDP : ఉత్త‌రాంధ్ర గిరిజ‌న సంప‌ద కోస‌మే విశాఖ రాజ‌ధాని – టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ధారునాయ‌క్‌

TDP

TDP

సీఎంగా జగన్‌రెడ్డి పదవి చేపట్టి 52 నెలలు గడుస్తున్న ఆయన గిరిజనులకు చేసింది ఏమీ లేద‌ని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ధారూనాయ‌క్ అన్నారు. గిరిజన సంక్షేమంపై జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని మండిప‌డ్డారు. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర గిరిజన సంపదను దోచుకోవాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. రాజధాని విశాఖకు తరలించి ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజన సంపదను జగన్ రెడ్డి తన బినామీలు ద్వారా కొల్లగొట్టాలని చూస్తున్నార‌ని తెలిపారు. అందుకే రాజధానిని విశాఖకు తరలించాలని జగన్ రెడ్డి ఉర్రూతలూగుతున్నార‌ని.. ఇప్పటి వరకు మైదాన ప్రాంతాన్ని కొల్లగొట్టిన జగన్ రెడ్డి ఇకపై ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సంపదను దోచుకోవాలని ప్రణాళిక సిద్దం చేశారన్నారు. అందుకే లక్షలాధి గిరిజన భూములను పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే తన బినామీలకు పంచిపెట్టార‌ని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏజెన్సీ కొండప్రాంతాల కోసం 108 అంబులెన్సుల పేరుతో లక్షలాధి రూపాయలు దోచుకున్నారని.. ఏజెన్సీ ప్రాంత గ్రామాలకు రోడ్లు వేయకపోవడంతో నిండు గర్బిణీలు ఫీడర్ అంబులెన్సులు ఉన్నా డోలీలలో దవాఖానలకు తీసుకెళ్లే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువైందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి హబ్‌గా మార్చి గిరిజన యువత భవితను దెబ్బతీస్తున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా జగన్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల అస్థిత్వంపైనే దెబ్బగొడుతున్నారని..ఏజెన్సీ ప్రాంతాల పరిధిని తగ్గించే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నదని ఆరోపించారు. గిరిజన ప్రాంతాలను ఎందుకు తగ్గించారని ఇటీవల హైకోర్టు సైతం జగన్ రెడ్డి ప్రభుత్వానికి మొటిక్కాయలు వేయడం జరిగిందని గుర్తు చేశారు.

Also Read:  BRS Activist Died : కేసీఆర్ ప్రచార సభలో అపశృతి..బిఆర్ఎస్ కార్యకర్త మృతి