Site icon HashtagU Telugu

Krishnapatnam Port : సెక్యూరిటీ గార్డులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం

Tdp Mla Somireddy Over Acti

Tdp Mla Somireddy Over Acti

ఏపీలోని కృష్ణపట్నం (Krishnapatnam Port) పోర్టులో నిలిచిపోయిన కంటైనర్ టెర్మినల్ పనులు (Container terminal works) పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) అన్నారు. టెర్మినల్ నిలిచిపోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన 10,000 మంది ఉద్యోగుల కోసం పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం పార్టీల నేతలు పోర్టును సందర్శించారు.

అయితే, ఈ సమయంలో పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ప్రతినిధులను అడ్డుకోవడంతో, ఎమ్మెల్యే సోమిరెడ్డి సెక్యూరిటీ గార్డులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మీడియాను అనుమతించాలని కోరినా, వారు వినిపించుకోకపోవడంతో ఆగ్రహంతో సిబ్బందిపై నెట్టివేసినంత పనిచేశారు. దీనికి సంబదించిన వీడియో వైరల్ అవుతుంది. కృష్ణపట్నం టెర్మినల్ తరలింపుకు వ్యతిరేకంగా నెల్లూరు ప్రాంతంలో అన్ని పార్టీల మద్దతుతో పోరాటం చేయాలని సోమిరెడ్డి ప్రకటించారు. ఈ అంశంలో ఆదానీ గ్రూప్ టెర్మినల్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also : Gaganyaan Mission..2026 లో ‘గగన్ యాన్’ మిషన్ : ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటన