Site icon HashtagU Telugu

Judges Trolling: ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై ట్రోల్స్.. టీడీపీ నేత అరెస్ట్

Judge Trolling

Judge Trolling

Judges Trolling: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్లెక్కారు. కార్యకర్తల నిరసనలకు దిగి అధికార పార్టీ వైసీపీపై ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు. సీఎం జగన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ లోనే కాకుండా తెలంగాణలోనూ నిరసనలు తెలిపారు. ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్టుని ఖండించారు. మరోవైపు బెంగుళూరులోని బాబుకు మద్దతుగా నిరసనలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై ఆరోపణలు చేశారు. ఆమెను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు దారుణంగా ట్రోల్స్ కు పాల్పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేత బుద్దా వెంకన్నతో పాటు ఇతర నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఏసీబీ జడ్జి హిమ బిందుపై అసభ్యకరమైన రీతిలో పెట్టిన పోస్టులపై నంద్యాల పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ లీడర్ ని అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ జడ్జి హిమ బిందుపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు తేలడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పీజీ పూర్తి కంప్లీట్ చేసి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ఖాజా తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో అతడిని కోర్టులో హాజరు పరుస్తామని నంద్యాల పోలీసులు తెలిపారు.

Also Read: Big Alert: వేస్ట్ పేపర్ లో ప్యాక్ చేసిన ఫుడ్ ను తింటున్నారా.. అయితే బీ అలర్ట్