Site icon HashtagU Telugu

Mood Of the Nation 2024 : ఏపీలో ‘టీడీపీ- జనసేన’ కూటమిదే విజయం

Tdp Projected To Win 17 Of

Tdp Projected To Win 17 Of

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పలు సంస్థలు సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే పనిలో ఉంటాయి. వారి అభిప్రాయాలను బట్టి ఏ పార్టీ గెలుస్తుందో..ఎన్ని సీట్లు సాధిస్తుందో వంటివి తెలియజేస్తుంటాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక సంస్థలు సర్వేలు చేసాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీదే విజయం అని తేల్చగా..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో సర్వేలు మొదలుపెట్టాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే – సీఓటర్ (Mood Of the Nation 2024) కలిసి పార్లమెంట్ ఎన్నికల ఫై సర్వే చేసింది. ఈ సర్వే లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ (Congress) విజయకేతనం ఎగరువేయడం ఖాయమని తేల్చి చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల్లో టి-కాంగ్రెస్‌ 10 సీట్లు సాధిస్తుందని , గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్, ఈసారి మూడు సీట్లతో సరిపెట్టుకోబోతున్నట్లు తెలిపింది. ఇక 4 సిట్టింగ్ స్థానాలున్న బీజేపీ.. ఒక సీటు కోల్పోనుందని , హైద్రాబాద్ ఎంపీ సీటును మజ్లిస్ నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే – సీఓటర్ సర్వే స్పష్టం చేసింది.

ఇక ఏపీ విషయానికి వస్తే..పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన (TDP-Janasena) కలిసి 17 సీట్లు కైవసం చేసుకోనుందని , వైసీపీ 8 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలో తేలింది. ఓట్ షేరింగ్ సైతం టీడీపీ పార్టీకి 45 శాతం ఓట్లు , వైసీపీకి 41 శాతం ఓట్లు పడతాయని తెలిపింది. ఇక కాంగ్రెస్, బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని ఇండియాటుడే – సీ ఓటర్ సర్వే తేల్చింది. ఈ సర్వే రిపోర్ట్ ను టీడీపీ ట్వీట్ చేసి..”Bye ..Bye Jagan ” అంటూ పోస్ట్ చేసింది. మరి నిజంగా ఈ సర్వే ప్రకారం జరుగుతుందా..లేక మరోలా వస్తుందా అనేది చూడాలి.

Read Also : Yatra 2 : ప్రజలను దగ్గరుండి యాత్ర 2 కు తీసుకెళ్తున్న వైసీపీ శ్రేణులు ..?