Punganur : పాపాల పెద్దిరెడ్డి..అంటూ పుంగనూరు సభలో చంద్రబాబు ఫైర్..

పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని పుంగనూరు సభ సాక్షిగా చంద్రబాబు హెచ్చరించారు

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 08:41 PM IST

చంద్రబాబు (Chandrababu) జోరు..హోరు చూస్తుంటే వైసీపీ (YCP) నేతలకు నిద్ర కాదుకదా..కనీసం అన్నం కూడా తినబుద్ది కావడం లేదు. ఓ పక్క పవన్ కళ్యాణ్ , మరోపక్క చంద్రబాబు..ఇద్దరు ఎక్కడ తగ్గకుండా వైసీపీ అభ్యర్థులను విరుచుకుపడుతున్నారు. నెల క్రితం వరకు ఓ లెక్క ఆ తర్వాత నుండి మరో లెక్క గా మారింది. మండు ఎండను సైతం లెక్కచేయకుండా బాబు వరుస రోడ్ షో లు , సభలు నిర్వహిస్తూ అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఓ పక్క కూటమి వస్తే జరిగే మంచిని వివరిస్తూనే..ఐదేళ్ల వైసీపీ నేతల అరాచకాలను ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈరోజు మంగళవారం పుంగనూరు (Punganur ) సభలో మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy Ramachandra Reddy ) ఫై ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు. పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని పుంగనూరు సభ సాక్షిగా చంద్రబాబు హెచ్చరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని ప్రజలకు వెల్లడించారు. పుంగనూరుకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చిందని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేసారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘మాతో నీకు పోలిక ఏంటి పాపాల పెద్దిరెడ్డి. పొగరబోతు, ఆంబోతుగా పెద్దిరెడ్డి తయారయ్యాడు. ఆయన రాజకీయ అహంకారానికి గండి పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. నీకిక నిద్ర పట్టదు. నీ శివశక్తి డెయిరీకి తప్ప వేరే డెయిరీలకు పాలు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నావ్. అక్రమ ఇసుక, మద్యం కాంట్రాక్ట్‌లు అన్ని నీ కుటుంబానివే. రూ. 32 వేల కోట్ల అవినీతి చేశాడు. నీ ఊరికి పోయినందకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టావ్.చల్లాబాబుపై ఎన్నో కేసులు పెట్టావ్….కానీ మా వాళ్లు భయపడలేదు. నా నుంచి తప్పించుకోగలవా…. నిన్ను వదిలిపెట్టాను. అంగళ్లులో వైసిపీ మూకలతో నాపైన రాళ్లదాడి చేయించి…నాతో పాటు 800 మందిపై కేసులు పెట్టావ్. నా కార్యకర్తలను వేధింపులకు గురిచేశావ్… ఏది మరిచిపోలేదు, నువ్వు చేసిన అరాచకాలు.. నా నరనర్రాల్లో ఉన్నాయి. జగన్ ఒక సైకో… ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాకా… గుద్దులే గుద్దులే, బాదుడే బాదుడే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు చేసిన అవినీతిని కక్కించి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఏపీలో ఉత్తర కొరియా మాదిరిగా కిమ్(జగన్) ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు క్యాస్ వార్ కాదని క్యాష్ వార్ అని అన్నారు.

Read Also : Heavy Rain in Hyderabad : గ్రేటర్ లో భారీ వర్షం..ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం..