Site icon HashtagU Telugu

TDP MLA : బాబు త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టే ప్రజాభిమానం క‌ట్ట‌లు తెంచుకుంది : టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల‌

TDP

TDP

చంద్రబాబు తప్పు చేయలేదనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే… ప్రజాభిమానం కట్టలు తెంచుకుందని టీడీపీ ఎమ్యెల్యే ప‌య్యావుల కేశ‌వ్ తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం చేయడం తప్ప 52 రోజుల్లో 50 పైసలైనా చంద్రబాబుకి వచ్చినట్టు జగన్ ప్రభుత్వం నిరూపించగలిగిందా? అని ప్ర‌శ్నించారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు రావడానికి 14 గంటల సమయం ఎందుకు పట్టిందో, ఎందుకంత జనసునామీ పోటెత్తిందో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్ప‌టికైనా తెలియాల‌న్నారు. అర్థరాత్రి నడిరోడ్లపై లక్షలాదిమంది జనం ఎందుకు నిలబడ్డారో.. పదేళ్ల నుంచి 70 ఏళ్ల వారి వరకు ఎవరి రాకకోసం పడిగాపులు కాశారో తెలిసి.. ఏమీ తెలియదన్నట్టు.. చూడలేదన్నట్లు మాట్లాడుతున్నారంటే కచ్చితంగా సజ్జలను ప్రజలు గుడ్డివాడిగా, మతిలేనివాడిగా భావిస్తారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా దేశాల్లో చంద్రబాబుకు మద్ధతుగా నిరసనలు, ధర్నాలు కొనసాగితే.. అవన్నీ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ అని సజ్జల అవహేళన చేశారన్నారు. మరి 14 గంటలపాటు సాగిన సంఘీభావయాత్ర ఎవరు ఆర్గనైజ్ చేశారో సజ్జల చెప్పాలన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రోడ్లపైనే పడుకొని.. చంద్రబాబు వాహనశ్రేణి వస్తుందని తెలియగానే రోడ్లపైకి పరిగెత్తుకు వచ్చిన జనాన్ని ఏమనాలి? చంద్రబాబు వల్ల తమకు ఈ మంచి జరిగింది .. తమ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని.. తమ కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి.. తమ కుటుంబానికి మేలు జరిగిందనే నమ్మకమే ప్రజల్ని రోడ్లపైకి తీసుకొచ్చిందన్నారు. రైతులు.. మహిళలు.. యువత.. వృద్ధులు ఇలా అన్నివర్గాల వారి గుండెల్లోని అభిమానం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే మీరు.. మీ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలని స‌జ్జ‌ల‌కు ప‌య్య‌వుల కౌంట‌ర్ ఇచ్చారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో సీఐడీ చీఫ్ .. అడిషనల్ ఏజీ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల.. మంత్రులు.. పదేపదే తమనోటికి వచ్చిన అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప.. వాస్తవాలు ప్రజల ముందు ఉంచడంలేద‌న్నారు . స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఒప్పందంలోఎక్కడా 90:10 అనే విషయం పొందు పరచలేదు అంటున్నారు. డబ్బు విడుదలకు ముందే.. చాలా స్పష్టంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 10శాతం సొమ్ము మాత్రమే చెల్లిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని.. ఆ ఒప్పందంలో 90 : 10 శాతానికి ఒప్పుకుంటున్నట్టు వికాశ్ కన్వేల్కర్.. గంటా సుబ్బారావు.. సుమన్ బోస్ సంతకాలు పెట్టారన్నారని ప‌య్యావుల కేశవ్ గుర్తు చేశారు.

Also Read:  TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి క‌నిపించ‌దా..?