ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ (YCP) అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి ..కొత్త వారికీ అవకాశం ఇస్తున్నారు జగన్. ఇప్పటీకే మూడు లిస్ట్ లను విడుదల చేసి దాదాపు హాఫ్ మంది అభ్యర్థులను ఖరారు చేయగా..ఇప్పుడు టిడిపి (TDP) కూడా తమ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం. దాదాపు 20 నుండి 25 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోందట..మరి రెండు రోజుల్లో వీరిని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం అందుతున్న ఆ లిస్ట్ చూస్తే (TDP MLA Candidates first List)..
కుప్పం – చంద్రబాబు
మంగళగిరి – నారా లోకేశ్
టెక్కలి – అచ్చెన్నాయుడు
కనిగిరి – ఉగ్ర నరసింహారెడ్డి
తిరువూరుకు – శ్యావల దేవదత్
ఆచంట – పితాని సత్యనారాయణ
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
బొబ్బిలి – బేబి నాయన
తుని – యనమల దివ్య
వెంకటగిరి – కురుగుండ్ల రామకృష్ణ
గుడివాడ – వెనిగళ్ల రాము
నెల్లూరు – డాక్టర్ థామస్
కమలాపురం – పుత్తా నరసింహారెడ్డి
అరకు – దన్ను దొర
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
పీలేరు – నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
కోవూరు – పోలంరెడ్డి దినేశ్ రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాంబాబు
గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
మాడుగుల – పీవీజీ కుమార్
ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు
చీరాల – కొండయ్య యాదవ్‌ల పేర్లు ప్రచారం అవుతుంది. మరి నిజంగా మొదటి లిస్ట్ లో ఉన్నది వీరేనా..లేక ఏమైనా మార్పులు చేస్తారా..అనేది చూడాలి.
Read Also : YCP : కడప జిల్లాలో ఊపిరి పీల్చుకున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు