Site icon HashtagU Telugu

Gannavaram : కడప టీడీపీ అభ్యర్థి మాధవిపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం..

Vjd Madavi

Vjd Madavi

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ (AP Election Notification 2024)రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ (Election) ను చాల కఠినంగా పాటిస్తున్నారు. రోడ్ల ఫై పార్టీల కు సంబదించిన హోర్డింగ్స్ కానీ , ప్లెక్సీ లు ఇలా ఏవి ఉన్న వాటిని తొలగించాలని ఈసీ (EC) ఆదేశాలు జారీ చేసారు. అలాగే ఎక్కడైనా కనిపించిన మా దృష్టికి తీసుకరావాలని సూచించడం తో అంత ఆ పనిచేస్తున్నారు. ముందు నుండి కూడా అధికార పార్టీ (YCP) ప్రచారానికి పెద్ద పీఠం వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చేసేది గోరంత..చెప్పేది కొండత అనే మాదిరిగా పబ్లిసిటీ తో ఉదరగొడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా అలాగే చేస్తుండడం తో ప్రత్యర్థి పార్టీలు ఎక్కడిక్కడే అడ్డుకుంటూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు గన్నవరం (Gannavaram)లో వైసీపీ(YCP)కి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మహిళా అభ్యర్థి మాదవి ((Madhavi)) ఫోటో తీస్తుండగా.. వంశీ (Vamshi)వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ వర్క్ షాప్‌లో పాల్గొనేందుకు ఆమె విజయవాడ వెళ్లారు. అయితే ఎక్కడ చూసినా వైసీపీ పోస్టర్లే కనిపించాయి. దీంతో వాటిని ఫోటోలు తీసి సీ విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే మాధవి ఫోటోలు తీయడం చూసి వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. పోలీసులు కూడా ఆమెతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలియడంతో గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) వెంటనే అక్కడకు వెళ్లారు. వైసీపీ నాయకుల చర్యలను ఆయన ఖండించారు. ఎన్నికల నిబంధనలను వైసీపీ నాయకులు యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

Read Also : Anna Hazare : కేజ్రీవాల్‌ అరెస్ట్ ఫై అన్నాహజారే కామెంట్స్