టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 46వ రోజూ కొనసాగాయి. నందిగామ నియోజకవర్గం చందర్లపాడులో నల్ల కండువాలతో పార్టీ శ్రేణుల నిరసన తెలిపారు. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గొల్లపూడి పార్టీ కార్యాలయం నుండి వన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద వరకు కాగడా ర్యాలీ చేపట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు టీడీపీ శ్రేణులు ‘భువనమ్మకు అండగా చంద్రన్నకు తోడుగా’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి అనుమతి లేదని పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భీమిలిలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టగా నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుండి బయట పడాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఏడవ రోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో గుంటూరు బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బ్లడ్ ఫర్ బాబు పేరుతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో హనుమంతురాయ చౌదరి ఆధ్వర్యంలో శివాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రిమాకులపల్లి నుండి ములకనూరు కొండ పైకి తిమ్మప్పస్వామి దేవాలయం వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు నాయకుడు గారిని ఆధారాల్లేని అక్రమ అరెస్టు చేసి 50 రోజులైన సందర్భంగా సాలూరు నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో “మోకాళ్లపై నిరసన” తెలిపారు. మంగళగిరి రూరల్ మండలం, కృష్ణాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు అవల రవికిరణ్, గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. లైబ్రరీ సెంటర్ నుంచి శివాలయం వరకు పెద్ద ఎత్తున కాగడాల ర్యాలీ చేపట్టారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు.
Also Read: TDP : ప్రభుత్వానిది ధనబలం.. మాది ప్రజాబలం.. శ్రీకాళహస్తిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి