Site icon HashtagU Telugu

TDP : “ఏపీ హేట్స్ జగన్” పుస్తకాన్ని ఆవిష్క‌రించిన టీడీపీ నేతలు

TDP

TDP

“ఏపీ హేట్స్‌ జగన్” పేరుతో టీడీపీ పుస్త‌కాన్ని ప్ర‌చురించింది. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఈ పుస్త‌కాన్ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అవిష్క‌రించారు. ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ని చెప్పుకుంటున్నార‌ని అచ్చెన్నాయుడు తెలిపారు. 52 నెలల వైకాపా పాలనలో ఒక్కో కుటుంబంపై జగన్‌ లక్షలాది రూపాయల భారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారమే రూ.64 వేల కోట్లని..  నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశారని.. మ‌రో  30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంలో తాడేపల్లి ప్యాలెస్‌ లక్ష కోట్ల కమీషన్‌ కొట్టేసిందని ఆరోపించారు.  తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టి.. చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చానని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. జగన్ నెరవేర్చని హామీల లిస్టు చాన్తాడంత ఉందని.. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చానని సీఎం జగన్‌ చెబుతున్నారని, అధికారంలో రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేద‌న్నారు.

Also Read:  Durga Temple : సామ‌న్య భ‌క్తుల సేవ‌లో ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌.. దుర్గ‌గుడిలో అడ్డ‌దారిలో ద‌ర్శ‌నాల‌కు చెక్‌