ఈరోజు చంద్రబాబు సీఎం (CM Chandrababu) అయ్యాడంటే దానికి కర్త , క్రమ , క్రియ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనే సంగతి తెలిసిందే. పవన్ తీసుకున్న నిర్ణయాలు వల్లే ఈరోజు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అలాంటి పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేయడం…జనసేన శ్రేణుల్లో ఆగ్రహం నింపుతుంది. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ (TDP MLA Damachrala Janardhan) టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, స్థానిక నాయకులు తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు శశిభూషణ్.. జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.
బాలినేని ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో తాము పడ్డ ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావని, అక్రమ కేసులు తమపై బనాయించి వేధించారన్నారు. అంతటితో ఆగక.. ప్రస్తుతం రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని జనసేన గుర్తుంచుకోవాలని, బాలినేనిని పార్టీలో చేర్చుకొనే ముందు తమను సంప్రదించాలన్న ఇంగిత జ్ఞానం జనసేన పార్టీ ప్రధాన నాయకులకు ఉండాలన్నారు. అంటే ఈ కామెంట్స్ పవన్ ను ఉద్దేశించి చేసినట్లుగా జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ (Riaz is the president of Janasena) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బహిరంగ సమావేశాలలో ప్రసంగించే సమయంలో ఆచితూచి మాట్లాడాలన్నారు. తన స్థాయి కూడా మరచి టీడీపీ నేత శశిభూషణ్ కామెంట్స్ చేశారని, సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కు ఇంగిత జ్ఞానం ఉందా అనే రీతిలో.. ప్రశ్నించడం తగదన్నారు. మరోమారు ఇలాంటి కామెంట్స్ చేస్తే జనసేన ఊరుకోదని కూడా హెచ్చరించారు.
Read Also : Lizard: దీపావళి రోజు ఇంట్లోకి బల్లి రావడం మంచిది కాదా.. పండితులు ఏం చెబుతున్నారంటే!