TDP : “ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా ” అన్న తాడిపత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి : వ‌ర్ల రామ‌య్య‌

  • Written By:
  • Publish Date - December 29, 2023 / 08:29 AM IST

“ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారిందన్నారు. టీడీపీ నాయకులు, రాజేంద్రనాధరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నారు. మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని. వైసీపీ నాయకులు అపాయింట్ మెంట్ కోరితే గేటు వద్దకొచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లార‌ని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. అదే టీడీపీ నాయకులు అపాయింట్ మెంట్ కోరితే మొండిచేయి చూపుతున్నార‌ని మండిప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

సభ్యతా, సంస్కారాలు లేని వ్యూహం సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అపాయింట్ మెంట్ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ల కు దున్నపోతు తలలు పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తికి సాదర గౌరవమిస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. డీజీపీకి నైతిక విలువలు ఉంటే వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని వ‌ర్ల రామ‌య్య డిమాండ్ చేశారు. కడుపు మండి కామెంట్ చేసిన యువకుడిని కాకుండా పొగరుతో కుల, మతాల మధ్య వైషమ్యాలు పెంచాలని పోస్టర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మని అరెస్టు చేయాలన్నారు. అరాచకాలను సృష్టిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యూహం సినిమా ను విడుదల కానీయకుండా చూడాలని.. డీజీపీ వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డు కు లేఖ రాయాలన్నారు. డీజీపీగా రాజేంద్రనాధరెడ్డి ఏకపక్ష వైఖరిని డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తామ‌ని తెలిపారు. డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమాను రిలీజ్ కాకుండా గట్టిగా పోరాడాలన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే ‘‘ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అనడం చట్టాలను శాసించేలా ఉందని.. అతన్ని వెంటనే అరెస్టు చేసి, బైండోవర్ చేయాలన్నారు. ఇకనైనా డీజీపీ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ.. సమధర్మం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన అవసరముందన్నారు.ట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.

Also Read:  Chandrababu : ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా : టీడీపీ అధినేత చంద్ర‌బాబు