Site icon HashtagU Telugu

AP : రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నాం : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

TDP

TDP

రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని.. పాలు పోసి పెంచిన పాము, వారినే కాటేసినట్లు పోలీసుల దుస్థితి ఉందన్నారు. గతంలో పోలీసులు రౌడీలను కొట్టేవారని.. ఇప్పుడు రౌడీలే పోలీసులను కొడుతున్నార‌ని వ‌ర్ల రామ‌య్య తెలిపారు. రాయచోటి సీఐ అనిల్‌ని వైసీపీ నాయకులు చితకబాదితే రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తోందని ఆయ‌న ప్ర‌శ్నించారు. గతంలో ప్రతిపక్షాలమీద మీసం మెలేసి తొడగొట్టిన అసోసియేషన్, ప్రస్తుతం పోలీసులనే కొడుతుంటే ఏంచేస్తోందపి ప్ర‌శ్నించారు. అధికార పార్టీవారితో గొడవలెందుకని సీఐ అనిల్ ని పోలీసు ఉన్న‌తాధికారులు సర్ది చెప్పడం బాధాకరమ‌న్నారు. సీఐని కొడుతున్నారని, రక్షించండని.. సీఐ అనిల్ భార్య శ్వేత 100 నెంబర్ కు ఫోన్ చేసి సహాయమడగడం ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటన్నారు. ఈ విషయంపై సీఎం, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఏముంటుంద‌ని వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

తప్పు చేసినవారు పోలీసులకు భయపడతారుగానీ వైసీపీ నాయకులు మాత్ర భ‌య‌ప‌డ‌టం లేద‌న్నారు. వైసీపీ నాయకుల దయా దాక్షిణ్యాల మీద పోలీసు వ్యవస్థ నడుస్తోందనిపిస్తోందని.. ఎంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తి మాట అనలేని స్థితిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉందన్నారు. ఇందుకు పోలీసు వ్యవస్థలో ఉన్న కొందరు ఉన్నతాధికారులే కారణమ‌ని.. వీరు అధికారపార్టీకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. టీడీపీ హయాంలో కానిస్టేబుల్ కొడుకుపై దాడి జరిగితే ఊరు ఊరంతా తిరగబడిన సంఘటనలున్నాయని.. సీఐపై జరిగిన దాడి లాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Also Read:  TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా