TDP : జ‌గ‌న్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై ఎందుకు లేదు..?

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 08:31 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర బృందం గానీ దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సాధారణంగా ముఖ్యమంత్రులు వారివారి రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడం కోసం అధికారిక పర్యటనలు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు జరిగే ఒక్క పర్యటనలో పాల్గొనలేదని ఆయ‌న ఆరోపించారు. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఆకర్షించడం కోసం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అతి ముఖ్యమైనదని.. ప్రపంచ వ్యాప్తంగా సదస్సుకు విచ్చేసే పెట్టుబడిదారులకు తమ తమ దేశాలలోని వ్యాపార అవకాశాలను వివరించి వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారని ప‌ట్టాభి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశాధ్యక్షులు, దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ దేశాలను, రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తహతహలాడుతారని.. దావోస్ సదస్సును ఎంతోప్రతిష్టాత్మకంగా తీసుకుని పెట్టుబడులు ఆకర్షించడం కోసం శాయశక్తుల పనిచేస్తారన్నారు.1995-2004, 2014-19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా అనేకమార్లు దావోస్ సదస్సులకు వెళ్లి అక్కడ ఏపీకి ప్రత్యేకంగా ఒక పవీలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడులు ఆర్షించేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు. కానీ, తెలుగు ప్రజలు దురదృష్టం గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ ఏడాది మినహాయిస్తే దావోస్‌లో జరిగిన నాలుగు సదస్సులకు గాను మూడింటికి జగన్ రెడ్డి డుమ్మా కొట్టార‌న్నారు. సదస్సుకు హాజరైన ఏడాది కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే చిత్తశుద్ది ఆయనలో ఎక్కడా కనిపించలేదన్నారు. అదేదో ఒక విహారయాత్రలా సరదాగా వెళ్లి తిరిగి వచ్చారని.. గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింద‌న్నారు.

Also Read:  Vangaveeti Radha : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత వంగ‌వీటీ రాధ‌

జగన్ మోహ‌న్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగేళ్లు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగితే మూడుసార్లు డుమ్మా కొట్డాడు. దావోస్ సదస్సులకు జగన్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి ఉంద‌న్నారు. వెళ్లిన ఒక్క ఏడాది కూడా కొన్ని కోట్ల రూపాయలు తగలేసి దావోస్ వెళుతున్నానని చెప్పి లండన్ వెళ్లారని ఆరోపించారు. దావోస్ వెళుతున్నానని చెప్పి లండన్ ఎందుకు వెళ్లాల్సివచ్చిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. దావోస్ పర్యటనలో ఏ ఒక్క విదేశీ కంపెనీ సీఈఓ కూడా జగన్ రెడ్డి ముఖం చూసిన పాపాన పోలేదన్నారు. జగన్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిన లబ్ది ఏమిటని అడిగితే వైకాపా మంత్రులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.