Paritala Sreeram: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింల అస్తిత్వానికి ఎక్కడ ప్రమాదం ఉన్నా అక్కడ నేనుంటానని అన్నారు. నాకు ఇష్ట దైవం ఆంజనేయస్వామి. అయితే, అల్లాను కూడా అలాగే ఆరాధిస్తానని చెప్పారు. ధర్మవరం సమీపంలో సీతారాంపల్లి క్రాస్ రోడ్డులో సోమవారం జరిగిన సంఘటనపై శ్రీరామ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Harish Rao : రేవంత్ రెడ్డి పరిస్థితి పాకిస్థాన్ కంటే దారుణం – హరీష్ రావు
ముస్లిం సోదరులు పట్ల దురుసుగా వ్యవహరించిన వారు ఎవరైనా చర్యలు తీసుకోవాలని చెప్పాం. కొందరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుంటారు. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. సంఘటన జరిగిన వెంటనే పోలీసులతో మాట్లాడాను. ఇందులో ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చని, పూర్తిగా సహకరిస్తామని చెప్పానని శ్రీరామ్ తెలిపారు.
Also Read: Viral : ప్రధాన మంత్రి ప్రచార మంత్రిగా.. ప్రకాష్ రాజ్ ట్వీట్
నేను ఇంత వేగంగా స్పందించడం కూడా కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు. బహుశా వారు అనుకున్న విధంగా ఈ గొడవ ముందుకు సాగలేదు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరంలో ముస్లింలతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను. ఇక్కడే కాదు రాష్ట్రంలో ముస్లింలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని శ్రీరాం పేర్కొన్నారు.