చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో రాజకీయంగా ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా స్థానిక టీడీపీ నేత హరినాథ్ (TDP Leader Harinath)పై వైసీపీ నేత బంధువు వేణుగోపాల్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హరినాథ్‌కు తీవ్ర గాయాలవడంతో ఆయనను కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య పొలానికి దారి విషయంలో వివాదం నడుస్తుండగా, అదే ఈ హింసాకాండకు కారణమయ్యిందని అంటున్నారు.
ఇదే ప్రాంతంలో గత నెలలో టీడీపీ కార్యకర్త రామకృష్ణపై వైసీపీ నేత వెంకటరమణ దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇప్పుడు అదే వెంకటరమణ బంధువు వేణుగోపాల్ మరోసారి హింసను తెరపైకి తీసుకొచ్చాడు. వరుస దాడులతో కృష్ణాపురంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది.
దాడికి ముందు హరినాథ్ మరియు వేణుగోపాల్ మధ్య చోటుచేసుకున్న భూ వివాదం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు స్పందిస్తూ, వీఐపీ మద్దతుతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్ ?!