2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌తో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ ఆశించిన స్థాయిలో ఎక్కువ సీట్లు సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రశాంత్‌కిషోర్‌ల భేటీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పతనాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఐదేళ్ల పాలనను విశ్లేషించి మద్దతు ఇవ్వడం తన తప్పేనని పీకే విచారం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టత లేదని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో ప్రణాళికలు రచించడంలో జగన్ బిజీగా ఉన్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో చేదు అనుభవాన్ని చవిచూసిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
2019 ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డి విజయంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ కీలకంగా వ్యవహరించింది. ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపు అన్ని పీకే టీమ్ చూసింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రశాంత్ కిషోర్ సేవలను వైసీపీ వినియోగించుకుంది. కొన్ని నెలల క్రితం ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా తప్పుకున్నారు. ఆయన దగ్గర పని చేసిన రిషిరాజ్‌సింగ్ ప్రస్తుతం వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి దగ్గరవ్వడంతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. గత ఎన్నికల్లో పీకే వల్లే తాము గెలిచామని ఎమ్మెల్యేలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు పీకే టీడీపీకి వెళ్లడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు.