TDP-Janasena : జ‌న‌సేన‌తో పొత్తు టీడీపీకి మూడందాల చేటు, 30 చోట్ల అల‌జ‌డి

జ‌న‌సేనతో పొత్తు టీడీపీకి(TDP-Janasena) మూడందాల న‌ష్టం. ఆ విష‌యాన్ని టీడీపీలోని

  • Written By:
  • Updated On - January 30, 2023 / 01:53 PM IST

జ‌న‌సేనతో పొత్తు టీడీపీకి(TDP-Janasena) మూడందాల న‌ష్టం. ఆ విష‌యాన్ని టీడీపీలోని ఒక వర్గం బాహాటంగా అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికే కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, జ‌న‌సేన ఆశావ‌హుల మ‌ధ్య పోరు న‌డుస్తోంది. త్యాగాల‌కు సిద్ధం కావాల‌ని చంద్ర‌బాబునాయుడు(CBN) కొంద‌రికి సంకేతాలు ఇవ్వ‌డం అల‌జ‌డిని సృష్టిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌మండ్రి రూర‌ల్ వ్య‌వహారాన్ని తీసుకోచ్చు. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి ఉన్నారు. ఆ స్థానం నుంచి కందుల దుర్గేష్ జ‌న‌సేన నుంచి పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా క‌నీసం 30స్థానాల‌కు త‌గ్గ‌కుండా అంత‌ర్గ‌త ఘ‌ర్ష‌ణ ఆ రెండు పార్టీల‌ మ‌ధ్య నెల‌కొంది.

జ‌న‌సేనతో పొత్తు టీడీపీకి (TDP-Janasena)

ఒక వేళ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే రాబోవు ప‌రిణామాల‌ను టీడీపీ (TDP-Janasena)సీనియ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వంగా ఆ రెండు పార్టీల భాగ‌స్వామ్యం ప్ర‌త్య‌క్షంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ 2014 నుంచి 2019 వ‌ర‌కు ప‌రిపాల‌న చేయ‌డానికి చంద్ర‌బాబు(CBN) ఇబ్బందులు ప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలోనూ బ‌య‌ట నుంచి ఆనాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మేయాన్ని చూశాం. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ ప‌లు విధాలుగా ఆప్ప‌ట్లో ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించారు. భూములు ఇవ్వ‌డానికి నిరాక‌రించిన రైతుల ప‌క్షాన ఆనాడు నిలిచారు. బ‌లవంత‌పు భూ సేక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ అల‌జ‌డి సృష్టించారు. గ‌త ఎన్నిక‌ల నాటికి రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ముక్కోణ‌పు పోటీలో 2019 ఎన్నిక‌ల్లో తిరిగిఅధికారంలోకి రావ‌చ్చ‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ అంచ‌నా వేసింది. సీన్ క‌ట్ చేస్తే, 23 మంది ఎమ్మెల్యేల‌కు టీడీపీ ప‌రిమితం అయింది.

Also Read : TDP-Janasena : టీడీపీ,జ‌న‌సేన సీట్లు ఎవ‌రికెన్ని.? బాబు, ప‌వ‌న్ లెక్క ఇదేనా?

ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాల‌ని టీడీపీ భావిస్తోంది. కానీ, దేశ వ్యాప్తంగా బీజేపీ గేమ్ ల‌ను గ‌మ‌నిస్తే ఏక్ నాథ్ షిండేల‌ను ఏపీలోనూ క్రియేట్ చేసే అవ‌కాశం ఉంది. 2024 ఎన్నిక‌ల్లో అధికారం సంపాదించిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ రూపంలో ప‌ద‌వీ గండం చంద్ర‌బాబుకు పొంచి ఉంటుంది. ఇప్ప‌టి నుంచే సీఎం ప‌ద‌వి కోసం జ‌న‌సేన పావులు క‌దుపుతోంది. షేరింగ్ ప‌ద్ద‌తిన‌ సీఎం ప‌ద‌వి కావాల‌ని ఆ పార్టీకి చెందిన లీడ‌ర్లు మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, వ‌య‌స్సు స‌హ‌క‌రించ‌ని ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌కు అధికారం క‌ట్ట‌బెట్టేలా చంద్ర‌బాబు(CBN)తో లాబీయింగ్ ఉండాల‌ని జ‌న‌సేన కోరుకుంటోంది. ఏదో ఒక మార్గాన అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని వ్యూహాల‌ను ప‌న్నుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు టీడీపీకి అన్ని విధాలా న‌ష్ట‌మని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

జ‌న‌సేన పార్టీ వ‌ల‌న వ‌చ్చే లాభం కంటే ఎక్క‌వ న‌ష్టాన్ని…

వాస్తవంగా జ‌న‌సేన పార్టీకి గుర్తింపు ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. ఎలాగైనా పొత్తు పెట్టుకుని(TDP-Janasena) రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం నుంచి బ‌య‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే సీఎం ప‌ద‌విని అందుకోవాల‌ని కాపు నాయ‌కులు బ‌య‌ట నుంచి చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ జాబితాలో హ‌రిరామ‌జోగయ్య‌, ముద్ర‌గ‌డ, గంటా త‌దిత‌రులు ఉన్నారు. వాళ్లు అల్లుతోన్న రాజ‌కీయ వ్యూహాల్లో చంద్ర‌బాబు ప‌డిపోయారు. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవాల‌ని నిర్థారించుకున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, కొన్ని స్థానాల్లోని ఇంచార్జిల‌కు త్యాగం చేయాల‌ని సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అంటే, జ‌న‌సేన పార్టీ వ‌ల‌న వ‌చ్చే లాభం కంటే ఎక్క‌వ న‌ష్టాన్ని చంద్ర‌బాబు గ్ర‌హించ‌లేక‌పోతున్నార‌న్న‌మాట‌.

Also Read : Janasena- TDP: జనసేన, టీడీపి దూకుడుకు కేసీఆర్ సైలెంట్ చెక్

మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల మీద ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా తాజా బీజేపీ శ్రేణుల‌కు సంకేతాలు ఇచ్చారు. అగ్ర‌వ‌ర్ణ పేద‌లు దాదాపుగా ఇదే కోవ‌లోకి వ‌స్తారు. ఆ విభాగం చాలా పెద్ద ఓటు బ్యాంకు అనే విష‌యం దేశ వ్యాప్తంగా బీజేపీ గుర్తించింది. ఇప్ప‌టికే అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించిన బీజేపీ ఈసారి కూడా ఆ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీస్తోంది. ఇదే స‌మ‌యంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని హ‌రిరామ జోగ‌య్య డిమాండ్ చేస్తున్నారు. జన‌సేన‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆ అంశం తెర‌మీద‌కు ప్ర‌ధానంగా రానుంది. అప్పుడు బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి, యాద‌వ‌, కుర‌మ‌..త‌దిత‌ర 45 కులాలు వ్య‌తిరేకం అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంది. ఆ విష‌యాల‌ను గ‌మ‌నించ‌కుండా చంద్ర‌బాబు వేస్తోన్న ఎత్తుగ‌డ‌లు టీడీపీకి న‌ష్ట‌మ‌ని సీనియ‌ర్ల భావ‌న‌.

జ‌న‌సేన ప‌ద్మ‌వ్యూహంలో టీడీపీ

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చూస్తానంటూ పెద్ద వ్యూహాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎత్తుగ‌డ వేశారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయింది. కానీ, చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి రాలేక‌పోయారు. ఈ లాజిక్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా జ‌న‌సేన వేసిన ప‌ద్మ‌వ్యూహంలో టీడీపీ ప‌డిపోయింది. దాని దుష్ప‌రిణామాలు అప్పుడే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

Also Read :TTDP Alliance : ప్ర‌జా కూటమి దిశ‌గా టీటీడీపీ, కాసానితో `తీన్మార్` మ‌ల్ల‌న్న స్కెచ్!