AP : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-జనసేన పార్టీల సరికొత్త లోగో

ఏపీ ఎన్నికల్లో జనసేన – టీడీపీ (TDP -Janasena)పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే పొత్తులకు సంబదించిన అంశాలు, పోటీ చేయబోతున్న స్థానాలు , అభ్యర్థుల ఎంపిక తదితర వాటిపై చర్చలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉమ్మడి పార్టీ ల సరికొత్త లోగో (Logo) ను విడుదల చేసారు. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి (బుధవారం) నుంచి “రా కదలి రా!” పేరిట కార్యక్రమాలకు టీడీపీ […]

Published By: HashtagU Telugu Desk
Tdp Janasena New Logo

Tdp Janasena New Logo

ఏపీ ఎన్నికల్లో జనసేన – టీడీపీ (TDP -Janasena)పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే పొత్తులకు సంబదించిన అంశాలు, పోటీ చేయబోతున్న స్థానాలు , అభ్యర్థుల ఎంపిక తదితర వాటిపై చర్చలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉమ్మడి పార్టీ ల సరికొత్త లోగో (Logo) ను విడుదల చేసారు.

జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి (బుధవారం) నుంచి “రా కదలి రా!” పేరిట కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కృతమైంది. మంగళవారం సైకిల్ – గాజు గ్లాసుతో కూడిన లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆవిష్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే పంచాయితీల సమస్యలపై రేపు సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు, 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ బహిరంగసభ ఏర్పాట్లలో పార్టీ నేతలు బిజీ అయ్యారు.

Read Also : Dry & Rough Skin Tips : చర్మం పొడి భారీ గరుకుగా మారిందా ఇబ్బంది పడుతున్నారా..? అయితే ప్రతిరోజు ఈ జ్యూస్ తాగాల్సిందే..

  Last Updated: 02 Jan 2024, 03:12 PM IST