టీడీపీ జనసేన పొత్తు కుదిరన తరువాత కీలక సమావేశం జరుగుతుంది. రేపు ఇరు పార్టీలు సంయూక్త కార్యచరణపై రాజమండ్రిలో తొలి భేటీ కానున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరు పార్టీలు ఉమ్మడి పోరాటం, పార్టీల సమన్వయంపై చర్చించనున్నారు. ఇప్పటికే సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి. ఉమ్మడిగా రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రిమాండ్‌లో ఉన్నారు. దాదాపు నేటికి 44 రోజులు అవుతుంది. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వస్తుందని టీడీపీ నేతుల భావించినప్పటికి వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై కూడా ఫోకస్ పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత అగిన కార్యక్రమాలన్నీ పునరుద్దరణ చేయాలని నిన్న జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటు జనసేన పొత్తు విషయంలో మరింతగా దూకుడుగా వ్యవహరించాలని టీడీపీ భావించింది. ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం చేసే అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లుందుకు టీడీపీ సిద్ధమైంది. రేపు రాజమండ్రిలో జరిగే జనసేన – టీడీపీ సంయూక్త కార్యచరణ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.