TDP-Janasena First List : రేపు 90 మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్..?

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 09:14 PM IST

తెలుగు తమ్ముళ్ల (TDP) తో పాటు జనసేన (Janasena) సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లిస్ట్ (First List) రాబోతుంది. రేపు శనివారం మధ్యాహ్నం ఏకంగా 90 (90 Candidates) మందితో కూడిన మొదటి లిస్ట్ ను టీడీపీ – జనసేన ఉమ్మడి గా విడుదల చేయబోతుంది. టీడీపీ నుండి 75 , జనసేన నుండి 15 మంది అభ్యర్థుల పేర్లు ఈ లిస్ట్ లో ఉండబోతున్నాయి. ఇప్పటీకే టీడీపీ అధినేత నేత చంద్రబాబు (Chandrababu) పార్టీ కీలక నేతలకు దీనికి సంబంధించి సమాచారం పంపడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల లోపు అంత పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ వరుసపెట్టి అభ్యర్థులను ప్రకటిస్తుండగా..పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ఫై గత కొద్దీ రోజులుగా కసరత్తులు జరుపుతూ వచ్చారు. ఇక ఇప్పుడు కసరత్తులు పూర్తి కావడం తో రేపు దాదాపు 90 మందితో కూడిన లిస్ట్ ను ప్రకటించాలని డిసైడ్ అయ్యింది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయడం వల్ల వైసీపీ గెలుపుకు బాట వేసినట్లు అయ్యింది. అందుకే ఈసారి పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా కార్యాచరణ మొదలుపెట్టారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి 75 పేర్లను.. జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. రేపు(శనివారం) ఉదయం తెలుగుదేశం కార్యాలయానికి రావాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు సూచించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలను ఉదయం చంద్రబాబు నివాసానికి రావాలని అన్నారు. వారితో చంద్రబాబు తొలుత మంతనాలు జరపనున్నారు. ఆ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ జాబితాలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతాయో చూడాలి.

Read Also : Chapathi Tips : మీకు తెలుసా ? చపాతీ అలా కాల్చితే క్యాన్సర్ రావొచ్చు..