Site icon HashtagU Telugu

TDP : చంద్ర‌బాబు ఆయుధాలు కోడిక‌త్తి,వివేకా హ‌త్య

CBN P4 Formula

Cbn

ప్ర‌జ‌ల్లోకి వేగంగా వెళ్లే అంశాల‌ను ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి రాజ‌కీయ పార్టీలు(TDP)ఎంచుకోవ‌డం స‌హ‌జం. ఆ విష‌యంలో తెలుగుదేశం పార్టీ మిగిలిన వాటికి కంటే ఒక అడుగు ముందుంటుంది. కార‌ణం సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు(CBN) ఆ పార్టీకి అధిప‌తిగా ఉండ‌డం. ఇప్పుడున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌ల‌హీన‌ప‌రుస్తూ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అందొచ్చిన అవ‌కాశాల‌ను అస్త్రాలుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ప్ర‌యోగిస్తున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తూ ఎత్తుగ‌డ‌లు (TDP)

ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌తో పాటు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య‌, కోడి క‌త్తి కేసుల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి టీడీపీ(TDP) తాజాగా ప్లాన్ చేసింది. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ప్రచారంలో ఎన్‌ఐఏ, సీబీఐ కేసులను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానిక బ్లూ ప్రింట్ ను అధిష్టానం ర‌చించింది. ఈ రెండు కేసులు 2024 ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి కీలకంగా మార్చుకోవ‌డానికి చంద్ర‌బాబు (CBN)స్కెచ్ వేశారు. రాబోవు రోజుల్లో ఆ రెండు కేసులు వైఎస్సార్‌సీపీని దెబ్బతీస్తాయని టీడీపీ వ్యూహ ర‌చ‌న‌ కమిటీ అంచ‌నా వేస్తోంది. అందులో భాగంగా టీడీపీ నేత‌లు ఇటీవ‌ల కోడిక‌త్తి, బాబాయ్ మ‌ర్డ‌ర్ కేసుల‌ను వీలున్నంత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు. ఆ పార్టీ సోష‌ల్ మీడియా కూడా ఈ రెండు కేసుల‌ను విస్తృతంగా ఫోక‌స్ చేస్తోంది.

జగన్మోహ‌న్ రెడ్డి మీద గ‌త ఎన్నిక‌లకు ముందుగా హ‌త్యాయ‌త్నం

విశాఖ విమానాశ్రయంలో జగన్మోహ‌న్ రెడ్డి మీద గ‌త ఎన్నిక‌లకు ముందుగా హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఆ రోజున ఆ సంఘ‌ట‌నను టీడీపీ(TDP) కుట్ర‌గా వైసీపీ ప్ర‌చారం చేసింది. స‌హ‌జంగా సానుభూతి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చింది. కానీ, టీడీపీ ప్ర‌మేయం లేద‌ని తాజాగా ఎన్ ఐఏ తేల్చింది. పైగా ఆ దాడికి పాల్ప‌డిన నిందితుడు శ్రీనివాసరావు వైసీపీకి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ కేసులో ప్ర‌ధాన బాధితుడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ ఐఏ కోర్టుకు హాజ‌రు కాలేదు. దీంతో ఆ కేసు విచార‌ణ ఆల‌స్యం అవుతోంది. నిందితుడు జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నాడు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని ఎన్ ఐఏ కోర్టు ఇటీవల ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న హాజ‌రు కాలేదు. పైగా ఆ కేసును మ‌రింత లోతుగా ప‌రిశోధ‌న చేయాల‌ని కోరుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాదులు కోర‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు మెడ‌కు చుట్ట‌డానికి ప్ర‌య‌త్నం (CBN)

విశాఖ ప‌ట్నం విమానాశ్ర‌యం కేంద్రంగా జ‌రిగిన కోడిక‌త్తి కేసు ఎపిసోడ్‌లో బలిపశువుగా శ్రీనివాసరావు మారాడు. కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సానుభూతి వ‌స్తుంద‌ని మాత్ర‌మే ఆ దాడికి. పాల్ప‌డిన‌ట్టు ఇప్ప‌టికే శ్రీనివాస‌రావు ఇచ్చిన స్టేట్మెంట్ ను ఎన్ ఐఏ రికార్డ్ చేసింది. ఫ‌లితంగా. టీడీపీ (TDP) కుట్ర ఏమీ లేద‌ని తేల్చేసింది. ఎన్ ఐఏ చెప్పిన దాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు లీడ‌ర్ల‌కు దిశానిర్దేశం చేయ‌డం జ‌రిగింది. ఇక మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును అప్ప‌ట్లో చంద్ర‌బాబు(CBN) మెడ‌కు చుట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేసింది. గ‌త ఎన్నికల సంద‌ర్భంగా ఆ కేసును టీడీపీ స్థానిక నేత‌ల‌కు చుడుతూ చంద్ర‌బాబుపై కూడా దుమ్మెత్తిపోశారు. కానీ, ఇప్పుడు విచార‌ణ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబ ప్ర‌మేయం బ‌య‌ట‌ప‌డుతోంది. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనైతిక రాజ‌కీయాల‌ను ప్ర‌జాకోర్టులో ఉంచాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

Also Read : TDP Rally: గుడివాడ ‘ఇదేం ఖర్మ’ బంపర్ హిట్, పోటెత్తిన జనం

వివేకా హ‌త్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ లో జగన్ మోహన్ రెడ్డి తో పాటు అతని కుటుంబంపై రాజ‌కీయ దాడి చేయ‌డంలో టీడీపీ (TDP) నేత‌లు దూకుడుగా ఉన్నారు. క‌డప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులను ఇవ్వ‌డాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేసింది. ఈ కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్టు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆందోళ‌న క‌లిగించే అంశం. అయితే, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చేసిన ప్రకటనలకు సంబంధించిన పలు వీడియో క్లిప్‌లను మీడియా వ‌ద్ద ప్ర‌ద‌ర్శిస్తూ వీలున్నంత‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విల‌న్ గా చూప‌డంలో టీడీపీ విజ‌యం సాధించింది. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లో టెన్షన్ తో పాటు జగన్మోహ‌న్ రెడ్డి అనైతిక ప‌నుల‌పై వైసీపీలోని కొన్ని వ‌ర్గాలు మాట్లాడుకునేలా టీడీపీ చేసింది.

ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేల మీద ఆధార‌ప‌డి రాజ‌కీయాల‌ను నెరిపే చంద్ర‌బాబు, తాజాగా కోడిక‌త్తి, బాబాయ్ మర్డ‌ర్ అంశాల‌ను ఫోక‌స్ చేయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ రెండు అంశాల దృష్ట్యా జ‌గన్మోహ‌న్ రెడ్డి మీద ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లింద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, ఆ రెండు అంశాల‌పై టీడీపీ(TDP) ఫోక‌స్ పెట్టింది.

Also Read : CBN : చంద్ర‌బాబుపై రాళ్ల దాడి వెనుక పొలిటిక‌ల్ కుట్ర‌?